
ప్రతి నెలలో అమావాస్యలు వస్తాయి. కానీ అన్నింటికంటే చాలా ప్రత్యేమైన, ప్రాముఖ్యత ఉన్న అమావాస్య అంటే మౌనీ అమావాస్య. భారతదేశంలో మౌనీ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ రోజున కొన్ని పనులు చేయడం వలన మీకు పట్టిన దరిద్రాలన్నీ పటాపంచల్ అవుతాయంట. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మౌనీ అమావాస్యను జనవరి 18,2026లో జరుపుకోనున్నారు. ఈరోజు చాలా మంది ఎక్కువగా ప్రయోగరాజ్ వెళ్లి నది స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అక్కడ ప్రతి సంవత్సరం మాఘమేళను జరుపుతారు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ మౌనీ అమావాస్య చాలా ప్రత్యేకమైనది, ఈరోజు హర్షయోగం, ప్రత్యేక సంయోగాన్ని సూచిస్తుంది.

ఇక మౌనీ అమావాస్య రోజున నదిస్నానం ఆచరించడం, దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం. ఈరోజు ఎవరు అయితే బ్రహ్మముహుర్తంలోనే నిద్రలేచి, నది స్నానం ఆచరించి దానధర్మాలు చేస్తారో, వారికి వారి జీవితంలో పట్టిన దరిద్రాలన్నీ పటాపంచల్ అవుతాయంట. అందుకే తప్పకుండా ఈరోజున ధాన ధర్మాలు చేయాలని చెబుతుంటారు పండితులు.

ముఖ్యంగా మౌనీ అమావాస్య రోజున ఎవరు అయితే మౌనవ్రతం పాటించాలంట. ఈరోజు ఎవరు అయితే మౌన ఉపవాసం పాటిస్తారో వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందని చెబుతున్నారు నిపుణులు. మౌన వ్రతం తర్వాత పవిత్ర గంగానదిలో స్నానం చేసిన తర్వాత మౌన వ్రతం విరమించాలంట.

మౌన ఉపవాసం ఉండి, గంగానదిలో మూడు లేదా ఐదు సార్లు స్నానం ఆచరించిన తర్వాత, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు దానం చేయడం వలన పూర్వీకుల ఆశీర్వాదం కలుగుతుందంట. అంతే కాకుండా నువ్వుల లడ్డూలను దానం చేయడం వలన గత జన్మలో చేసిన పాపల నుంచి విముక్తి లభిస్తుందంట. అంతే కాకుండా ఈరోజున దుప్పట్లు, వస్త్రాలు దానం చేయడం కూడా చాలా మంచిదంటున్నారు పండితులు.