February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

Edited By:

Updated on: Jan 31, 2026 | 11:47 AM

మాస ఫలాలు (ఫిబ్రవరి 1-28, 2026): మేష రాశి వారికి ఈ నెల అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఫిబ్రవరి మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఫిబ్రవరిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల కీలక విషయాల్లో అనుకూలతలకు లోటుండదు. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది.  ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. విశ్రాంతి తగ్గే సూచనలున్నాయి. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ధన స్థానంలో గురు సంచారం, భాగ్య, దశమ స్థానాల్లో నాలుగు గ్రహాలు, లాభ స్థానంలో శని సంచారం కారణంగా ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. నెలంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు నిలకడగా ఉంటాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాలపరంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, శుక్ర, బుధ, కుజ గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. అధికారులకు మీరిచ్చే సలహాలు లబ్ధి చేకూరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రవి, కుజ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యయ స్థానంలో గురువు సంచారం కారణంగా అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులు తప్పక పోవచ్చు. ఆర్థిక విషయాల్లో మోసపోయే సూచనలున్నాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): శని, రాహు కేతువులు మినహా ఇతర గ్రహాలన్నీ చాలావరకు అనుకూల సంచారం చేస్తున్నందు వల్ల నెలంతా బాగా అనుకూలంగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి నిలకడగా సాగిపోతుంది. కొన్ని ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవ హరించడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో సమయం అనుకూలంగా ఉంటుంది.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): బుధ, శుక్ర, రవులతో పాటు రాహువు కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఇంటా బయటా మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.  అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ నెలంతా గురు, శుక్ర, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యో గాల్లో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. అధికారులకు మీ సమర్థత మీద బాగా నమ్మకం కలుగుతుంది. సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యంగా భాగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లోనూ, పరీక్షల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఫిబ్రవరిలో రాశ్యధిపతి కుజుడి ఉచ్ఛ స్థితి కొనసాగడంతో పాటు మూడు గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల నెలంతా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగు తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురువు, రాహువు, కుజ, రవి, బుధులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నెలంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఏ రంగంలో ఉన్నా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాలు తగ్గి, లాభాల బాటపడతాయి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులకు ఆర్థికంగా బాగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, అయిదు గ్రహాలు సొంత రాశిలో, ధన స్థానంలో సంచారం చేయడం వల్ల నెలంతా ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు విస్తరిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలుంటాయి.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): పంచమ స్థానంలో గురువు, సొంత రాశిలో స్థానంలో బుధ, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఏ విషయంలోనైనా మీ మాట నెగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి లోటుం డని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో, కుజుడు లాభ స్థానంలో ఉచ్ఛలో అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందివచ్చే అవకాశముంది.  ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలను సొంత ఆలోచనలతో నిర్వహించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడ తాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విహార యాత్రలు చేస్తారు.