
హిందూ సంప్రదాయంలో మామిడాకులు ప్రత్యేక స్థానం ఉంది. గుమ్మాలకు మామిడాకులు తోరణాలుగా కట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే గ్రామాల్లో మామిడాకులు ఈజీగా దొరుకుతాయి. అయితే పట్టణాల్లో నగరాల్లో మామిడాకులు దొరకడం.. కష్టం.. దీంతో నగర వాసులు.. పండగలు వస్తే.. మామిడాకులకోసం మార్కెట్ కు పయనమవుతారు.

పండగలు పంక్షన్ల వస్తే.. పట్టణవాసులు పూజా సామగ్రితో పాటు.. పువ్వులు, మామిడాకులను మార్కెట్లో కొనుగోలు చేస్తారు.. అయితే ఇప్పుడు పూజా వస్తువులనే కాదు.. భోగిపిడకలు , కొబ్బరిచిప్పలు, వేప పుల్లలు అమ్మేవారు. ఇప్పుడు ఆ జాబితాలో.. మామిడాకులు కూడా చేరాయి. వీటిని కూడా ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు.

ప్రసుత్తం ఈ మామిడాకులు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఆన్ లైన్ లో పెట్టి అమ్ముతుంది. వీటిపై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

21 మామిడాకులు ఆన్ లైన్ లో రూ. 109 లకు లభిస్తున్నాయి. వీటి ఎమ్మార్ఫీ ధర. రూ. 290 లు కాగా డిస్కౌంట్ ఇవ్వడంతో కేవలం రూ. 109 లకే లభిస్తున్నాయి. అంటే ఒకొక్క మామిడాకు ధర ఐదు రూపాయలన్నమాట.

అయితే మరో సెల్లర్ 21 మామిడాకులు కేవలం రూ.77కి అమ్ముతున్నారు. ఎమ్మార్పీ రూ.249గా ఉంటే.. 69శాతం డిస్కౌంట్‌తో రూ.77 లకే లభిస్తున్నాయి.

గ్రామాల్లో ఉచితంగా లభించే మామిడాకులు ఇప్పుడు ఆన్ లైన్ అమ్మకానికి పెట్టడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందింస్తుండగా.. ఇది విన్న పెద్దలు.. కలికాలం అంటే ఇదే అంటూ కామెంట్ చేస్తున్నారు.