
పాలు పొంగించడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా శుభప్రదం. పాలు తెలుపు రంగులో ఉంటాయి. ఇవి స్వచ్ఛతను సూచిస్తాయి. అందువలన ఇంటిలో నివసించే వారు ఎప్పుడూ స్వచ్ఛమైన మనసుతో, ఆనందంగా ఉండేలా ఉండాలని పాలను పొంగిస్తారు అంటారు కొందరు.

ఇక హిందూ సంప్రదాయం ప్రకారం, పాలు చాలా పవిత్రమైనవి. ఇవి సౌభాగ్యానికి గుర్తు. అందువలన కొత్త ఇంటిలో సుఖ సంతోషాలు నెల కొనాలి అని, తొలి వంట చేసే సంకేతంగా వంటగదిలో పాలు పొంగిస్తారంట. పాల పొంగు అనేది ఆనందం, ఐశ్వర్యం, శ్రేయస్సును సూచిస్తుందని చెబుతున్నారు పండితులు.

కొత్త ఇంటిలో కొత్త కుండలో పాలను మరగబెట్టి పొంగేలే చేసినప్పుడు, అది ఎలానైతే పొంగుతుందో, ఆ పొంగు బయటకు వచ్చినట్లే, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం, సంపద, ధనం పెరుగుతాయని చెబుతున్నారు పండితులు.

అంతే కాకుండా నూతన గృహ ప్రవేశం రోజున పాలు పొంగించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా వాస్తు దోషాలు తొలిగిపోతాయంట. వాస్తు శాస్త్రం ప్రకారం, పాలు చాలా పవిత్రమైనవి. వీటిని కొత్త ఇంటిలో మరగబెట్టడం వలన వాటి ఆవిరి ఇంటిలోని ప్రతికూల శక్తిని సూచిస్తుందంట.

అలాగే పాలు చంద్రుడికి సంకేతం, అగ్ని కుజుడికి సంకేతం కాబట్టి, గృహ ప్రవేశం సమయంలో పొయ్యిమీద పాలు పొంగించడం వలన కుజ, చంద్రుల కలయిక జరుగుతుంది. ఇది ఇంటికి, కుటుంబానికి చాలా వాస్తు పరంగా మేలు చేస్తుందంట. ఇంటిలో సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుందంట. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.