
కలలు అనేవి రెడు రకాలు ఉంటాయి. కొన్ని శుభ ఫలితాలను అందిస్తే, మరికొన్ని చెడు ఫలితాలను అందిస్తాయి. ఇక కొంత మందికి కలలో తమ పూర్వీకులు, పాములు, చెట్టు, పుట్టలు, అందమైన ప్రదేశాలు కనిపిస్తే, మరికొంత మందికి మాత్రం, డబ్బులు కనిపిస్తుంటాయి. మరి కలలో డబ్బులు కనిపించడం దేనికి సంకేతం అంటే?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు అనేది ఒకరు తమ లక్ష్యాలను సాధించడం కోసం, లేదా వ్యక్తిగ వృద్ధి అనే అంశాలపై ఆధారపడి ఉంటుందంట. మీరు మీ జీవితంలో సానుకూల మార్పులు లేదా, కొత్త అవకాశాల కోసం డబ్బు అవసరం కావచ్చు, ఆ సమయంలో కలలో డబ్బు కనిపిస్తుంటుందంట.

అదే విధంగా అనుకోని విధంగా ఎవరైనా డబ్బును కోల్పోయే ప్రమాదం ఉన్నా, కలలో డబ్బు కనిపిస్తుందంట. దీంతో మీరు డబ్బు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డబ్బును ఉపయోగించుకోవడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుపుతుందంట.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు అనేది బృహస్పతి వంటి గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరి కలలోనైతే డబ్బు కనిపిస్తుందో, వారు త్వరలో విజయం సాధించబోతున్నారని అర్థం అంట, అంతే కాకుండా డబ్బు చంద్ర, గ్రహస్థానాలను బట్టి, మీరు జీవితంలో ఎదుర్కొనే సవాళ్ల నుంచి మీకు లభించే సంపన్నమైన జీవితం గురించి కలలు తెలియజేస్తాయంట.

ఇక మనస్తత్వ శాస్త్ర వేత్తల ప్రకారం, కలలో వచ్చే డబ్బు కేవలం భౌతిక ఆస్తులను మాత్రమే కాకుండా, ఒక వ్యక్తి గౌరవం, విశ్వాసం, జీవితంపై కూడా ప్రభావం చూపుతుందంట.ఒక వ్యక్తికి గుర్తి, గౌరవం వంటిది కూడా కలలో డబ్బు కనిపించేలా చేస్తుందంట. అలాగే కలలో డబ్బును కోల్పోవడం కనిపిస్తే, ఆర్థిక చింతలు ఎక్కువ అవ్వడం, అభద్రత భావం వంటి సమస్యలకు కారణం కావచ్చు అని వారు తెలుపుతున్నారు.