
వృషభం: ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి జూన్ మొదటి వారం వరకు దిగ్బల యోగం కలుగుతుంది. దీనివల్ల ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలనిస్తుంది. షేర్లు, స్పెక్యులే షన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. కొద్ది శ్రమతో ధన లాభాలు కలుగుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. మీరు పనిచేసే సంస్థలకు మీ వల్ల లాభాలు కలుగుతాయి. నైపుణ్యాలు వృద్ది చెందుతాయి.

మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఏడాదిపాటు దిగ్బల యోగం కలిగింది. దీని వల్ల కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

సింహం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల దిగ్బల రాజయోగం కలిగింది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ప్రభుత్వమూలక గుర్తింపు, ధన లాభం కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. ఇది రెండున్నరేళ్ల పాటు కొనసాగుతుంది. దీనివల్ల రాజకీయ నేతలతో పరిచయాలు పెరగడం, రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పట్టడం, రాజకీయ ప్రాబల్యం పెరగడం వంటివి జరుగుతాయి. జనాకర్షణ పెరుగుతుంది. ప్రజా సేవలో ఎక్కువగా పాల్గొంటారు. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

తుల: ఈ రాశికి దశమంలో మరో పది రోజుల పాటు కుజ సంచారం వల్ల దిగ్బల యోగం పట్టింది. దీని వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఈ రంగాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. సుమారు నెల రోజుల పాటు కొనసాగే ఈ యోగం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించి పని భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. వాహన యోగం కూడా పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.