Chanakya Niti: జీవితంలో చెడు సమయాలా.. నిరాశను పోగొట్టే చాణుక్యుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి

|

Jun 18, 2023 | 1:50 PM

 ఆచార్య చాణక్యుడు మంచి అధ్యాపకుడు మాత్రమే కాదు.. తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నాడు. వ్యక్తి జీవితంలో చెడు సమయాలు వస్తాయని.. అయితే వాటిని సానుకూల దృక్పధంలో ఎదుర్కోవాలని చాణుక్యుడు చెప్పాడు. క్లిష్ట పరిస్థితులలో చాణుక్యుడు చెప్పిన విషయాలు మార్గనిర్దేశం చేస్తాయి. వాటిల్లో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం..   

1 / 5
Chanakya Niti: జీవితంలో చెడు సమయాలా.. నిరాశను పోగొట్టే చాణుక్యుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి

2 / 5
వివేకం, మార్గదర్శకత్వం: కష్టాలు ఎదురైనప్పుడు తెలివైన, అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి జ్ఞానం, మార్గదర్శకత్వం పొందడం చాలా ముఖ్యం. వారి జ్ఞానం,అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలు మీకు వచ్చిన ఇబ్బందులను అధిగమించడానికి ఉపయోగకరంగా ఉంటాయి. తెలివి తేటలు కలిగిన వ్యక్తుల  వ్యూహాలు మీ సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయి. 

3 / 5
స్వీయ-అభివృద్ధిపై దృష్టి: ఒకొక్కసారి ఏర్పడిన చెడు సమయం కూడా మీ వ్యక్తిగత పెరుగుదల, అభివృద్ధికి అవకాశంగా ఉపయోగపడతాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కొత్త విషయాలను తెలుసుకోవడానికి మంచి సహకారిగా అవుతాయి. మీ బలహీనతలను బలోపేతం చేసుకోవడానికి చెడు  కాలాన్ని ఉపయోగించండి. నిరంతర స్వీయ-అభివృద్ధి భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది

4 / 5
ఫ్లెక్సిబిలిటీ: ఎప్పుడైనా సంక్షోభ సమయం ఏర్పడితే.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో సరళంగా ధృడంగా ఉండటం చాలా అవసరం. అంతేకాదు  కొత్త ఆలోచనలను స్వీకరించి అవసరమైన విధంగా మీ వ్యూహాలను సర్దుబాటు చేకుంటూ జీవితంలో ముందుకు వెళ్తే అభివృద్ధి మీ సొంతం. 

5 / 5
విశ్లేషణ, వ్యూహరచన: పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించి, సవాళ్లను అధిగమించడానికి వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాలని చాణక్యుడు సూచించాడు. సమస్యను చిన్నదిగా చేసే విధంగా పనులను విభజించుకుని..  వాటిని క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం వలన చెడు సమయాలు కూడా కలిసి వస్తాయి. 