- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti Tips: According to Chanakya Do This Work in Life, Success Will Kiss Your Feet
Chanakya Niti: మీ జీవితంలో ఈ పని చేయండి.. కోరుకున్న ఆనందం, విజయాన్ని పొందుతారు..!
ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రం గ్రంథంలో జీవితానికి అవసరమైన అనేక అంశాలనే పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 375–283 మధ్య కాలంలో రాసిన ఈ గ్రంథం నాటి నుంచి నేటి వరకూ ప్రతి ఒక్కరికీ అనుసరణీయంగా నిలుస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదని కూడా ప్రవరించారు. మరి ఆ వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం..
Updated on: Jul 03, 2023 | 7:49 PM

ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రం గ్రంథంలో జీవితానికి అవసరమైన అనేక అంశాలనే పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 375–283 మధ్య కాలంలో రాసిన ఈ గ్రంథం నాటి నుంచి నేటి వరకూ ప్రతి ఒక్కరికీ అనుసరణీయంగా నిలుస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదని కూడా ప్రవరించారు. మరి ఆ వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం..

ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి వ్యక్తికీ స్వీయ అవగాహన తప్పని సరి అని చాణక్య పేర్కొన్నాడు. ఒక నిర్ణయం తీసుకునే ముందు.. దానివలన కలిగే మంచి చెడుల గురించి అవగాహన కలిగి ఉండాలని తెలిపాడు.

డబ్బు: మనిషి జీవితంలో డబ్బును దాచుకోవడం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడానికి ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అవసరం. అలాగే సంపాదించిన డబ్బును సరిగా ఉపయోగించుకోవడం కూడా అవసరం. అది తెలిసినప్పుడే.. ఆనందమై, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం, దాతృత్వానికి ఉపయోగించడం చేయాలని సూచించారు చాణక్య.

ధర్మానికి కట్టుబడి ఉండాలి: ధర్మానికి కట్టుబడి జీవించే వారు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. జీవితంలో సమస్యలు వస్తాయి కానీ, అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. వ్యక్తి ఆధ్యాత్మిక చింతన, ధర్మచింతన వారిని సరైన జీవిత మార్గంలో తీసుకెళ్తాయి. ఆ విధంగా మతాన్ని, మత ఆచారాలను అనుసరించే వ్యక్తి ఎప్పుడు చెడు పనులు చేయరు.

మోక్షం: ఏ వ్యక్తి జీవితంలోనైనా చివరి దశ మోక్ష దశ అని పేర్కొన్నారు చాణక్యుడు. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి తన లక్ష్యం, పని, కర్మల ద్వారా మోక్షాన్ని పొందాలని కోరుకుంటాడు. అయితే, జీవితంలో సత్కర్మలు చేసిన వారికే మోక్షం లభిస్తుంది.