Chanakya Niti: వైవాహిక జీవితం విజయమా లేదా వైఫల్యమా? ఈ 4 విషయాలే నిర్ణయిస్తాయంటున్న చాణక్య

Updated on: Oct 15, 2025 | 1:13 PM

ఆచార్య చాణక్యుడు తక్షశిలలో అధ్యాపకుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, రాజకీయవేత్త, తత్వ వేత్త. చాణక్యుడికి మనిషి జీవితం గురించి లోతైన అవగాహన ఉంది. అందుకనే తన నీతి శాస్త్రంలో పాలన, ప్రేమ, డబ్బు, స్నేహం, విజయం వంటి అనేక విషయాలు వివరించాడు. అవి నేటికీ అనుసరణీయం. వీటిని పాటించడం వలన జీవితం సుఖ శాంతులతో సాగుతుంది. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివాహం విజయవంతమవుతుందా లేదా విఫలమవుతుందా ప్రస్తావించారు

1 / 5
ప్రపంచంలోని గొప్ప పండితులు, తత్వవేత్తలు, రాజకీయ వ్యూహకర్తలలో ఒకరైన చాణక్య.. తన చాణక్య నీతిలో అనేక విషయాలను వివరించాడు. ఈ నియమాలను పాటించడం వలన జీవితంలో ఎంతో మార్పును పొందుతారు. వివాహం విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయించే కొన్ని అంశాలను ప్రస్తావించాడు.

2 / 5
వివాహంలో భాగస్వామి తెలివితేటలు చాలా ముఖ్యమైనవి. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే సామర్థ్యం వారికి ఉంది. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. జీవితం నుండి మూడవ వ్యక్తిని దూరంగా ఉంచగలగాలి.

3 / 5
వివాహంలో ప్రేమ , నమ్మకం ముఖ్యమైనవి. భార్యాభర్తలు ఇద్దరూ  వైఫల్యం, కోపం, కుటుంబం , మార్పులను ఎలా ఎదుర్కొంటారనేది.. వారి వైవాహిక జీవితన్ని, వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

4 / 5
భార్య అయినా.. భర్త అయినా తమ భాగస్వామి మానసిక స్థితిని అర్థం చేసుకోగలగాలి. ఇది కేవలం కోపం విషయంలో మాత్రమే కాదు. తమ భాగస్వామి ని అర్థం చేసుకుని వారి సమస్యలను స్వీకరించగలిగినప్పుడే  కుటుంబ జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతుంది.

5 / 5
భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు అండగా నిలబడాలి. మద్దతు ఇవ్వాలి. కెరీర్, అనారోగ్యం మొదలైన అవసరమైన సమయాల్లో ఒకరినొకరు ఆదుకుని, సహాయం చేసుకున్నప్పుడే కుటుంబ జీవితం అందంగా సాగుతుందని చాణక్యుడు చెప్పాడు.