
వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు. ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది.

లోటుపాట్లను ఎత్తిచూపుకోవద్దు - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోకూడదు. ఇలా చేస్తే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.

స్వార్థపరులు : ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి స్వార్థపరుల నుంచి దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎవరినీ పట్టించుకోరు. వారు తమ ప్రయోజనాల కోసం ఎవరికైనా హాని చేయవచ్చు. అందుకే వారికి దూరంగా ఉండండి అంటూ పేర్కొన్నాడు.

అసూయతో ఉండే వ్యక్తులు: మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అలాంటి వారు మీరు విజయం సాధించడాన్ని అస్సలు చూడలేరు. మీరు ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి అనేక అడ్డంకులను సృష్టిస్తారు. అందుకే వీరిని దరిచేరనివ్వొద్దని చాణుక్యుడు తెలిపాడు.