ఆచార్య చాణక్యుడు ప్రకారం క్రమశిక్షణ లేని వారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు విజయవంతం కావాలంటే.. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయకూడదు. సమయం వృధా చేయవద్దు. క్రమశిక్షణ లేకుండా జీవితంలో విజయం సాధించలేరని అన్నారు.
ఎటువంటి సందర్భం ఎదురైనా కుటుంబ సభ్యులతో గొడవ పడవద్దని ఆచార్య చాణక్య సూచించాడు. మీకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా అండగా ఉండే కుటుంబ సభ్యులను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు అని.. ఒకొక్కసారి మీరు పశ్చాత్తాపడే పరిస్థితులు రావచ్చనని పేర్కొన్నాడు .
దానధర్మాలు: దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చాణక్యనీతి పేర్కొంది. అత్యవసర సమయాల్లో కూడా శ్రేయస్సు కోసం దాతృత్వమే కారణం కాగలదని, ఇది మీ జీవితం నుంచి పేదరికాన్ని తొలగించగలదని చాణక్యుడు చెప్పాడు. ఇంకా చాణక్య నీతి ప్రకారం దాతృత్వ గుణం ఆనందం, అదృష్టాన్ని కలిగిస్తుంది.
విశ్వాసం- విధేయత: కుటుంబ సభ్యుల మధ్య విశ్వాసం .. విధేయత ఉండే విధంగా చూడండి. ఈ చర్యలు ఫ్యామిలీ కి బలమైన పునాదిని ఏర్పరుస్తాయి. సురక్షితమైన, సహాయక గృహ వాతావరణాన్ని సృష్టించడం.. తద్వారా విశ్వసనీయత, విధేయతను ప్రోత్సహించండి. ఇది పరస్పర విశ్వాసాన్ని పెంచుతుంది.