
వృషభం: ఈ రాశివారికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల రాజయోగం కలిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ఈ రాశివారి వల్ల సంస్థకు అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో, శుభకార్యాలతో సాగిపోతుంది.

మిథునం: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం, పైగా ధన కారకుడైన గురువు కూడా కలవడం వల్ల రాజయోగాలకు ధన యోగాలు తోడవుతాయి. అందులో బుధుడు ఈ రాశినాథుడే కావడం వల్ల కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి రవితో ధన, లాభాధిపతి బుధుడు కలవడం వల్ల ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారం అవుతాయి. జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాశివారి మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. ఇతరుల సమస్యలను కూడా మధ్యవర్తిత్వంతో, కౌన్సెలింగ్ తో పరిష్కరించడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కన్య: ఈ రాశినాథుడైన బుధుడితో దశమ స్థానంలో రవి యుతి చెందడం వల్ల, ఈ రాశివారికి షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమై ఊరట కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యా లతో పాటు హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలు వైన ఆస్తి లభిస్తుంది. ఆదాయ వృద్ధికి మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తల పెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి సప్తమంలో ఈ అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా ఉన్నతాధికార యోగం పడుతుంది. ఒక సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.