
శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మార్చి 27 న శ్రీరామనవమి,28 న మహా పట్టాభిషేకం జరుగుతున్నాయి.మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటుచేయడంతో పట్టణం సరికొత్త శోభ సంతరించుకొంది. బ్రహ్మోత్సవాల తొలిరోజు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగనుపురస్కరించుకొని ఉదయం వేపపూత ప్రసాదవినియోగం, శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం నూతన పంచాంగశ్రవణం చేశారు. 23 న మండల లేఖ , కుండ, కలశ యాగశాల,24న గరుడాదివాసం, 25 న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 26న ఎదుర్కోలు, 27 నశ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల తిరు కల్యాణం, శ్రీరామ పునర్వసు దీక్షప్రారంభం కానున్నాయి.

28 న మహాపట్టాభిషేకం, 29 న సదస్యం నిర్వహించనుండగా 30 న తెప్పోత్సవం , 31 న ఊంజల్ సేవ ,ఏప్రిల్ 1 న వసంతోత్సవంరెండున పూర్ణాహుతి ,ద్వజారోహణంతో ఉత్సవాలు సమాప్తి కానుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. ఏప్రిల్ 2 వరకు ప్రభుత్వోత్సవం (దర్బారు సేవ), పవళింపు సేవలు సైతం నిలిపివేస్తారు.మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపాన్ని 24 సెక్టార్లుగా విభజించగా అందులో 31వేలమంది ప్రత్యక్షంగా కల్యాణం తిలకించడానికి వీలుంది.

ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కలెక్టర్ అంకిత్ ప్రత్యేక చొరవతో భక్తుల కోసం మిథిలా స్టేడియంలోని అన్ని సెక్టార్లలో పొగమంచు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భక్తులకు వేడి నుంచి ఉపశమనం లభించనుంది...భక్తుల రద్దీ ఈసారి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు..అందుకు గాను పటిష్ట సౌకర్యాలు, సదుపాయాలు..కల్పిస్తున్నారుకల్యాణ మండపంలో 50 టన్నుల ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లుఏర్పాటు చేస్తున్నాం. భద్రాచలం, పర్ణశాలల్లో నాలుగు లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లను వేస్తున్నారు. సెక్టార్లలోని భక్తులకునేరుగా మజ్జిగ, తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేచేస్తున్నారు..ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వైద్యశాఖ సహకారంతో ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు

నవమికి తరలివచ్చే భక్తుల కోసం 25 ప్రసాదాల కౌంటర్లు, 70తలంబ్రాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.నవమి అనంతరం కార్గో, పోస్టల్, ఆన్లైన్, ప్రచార శాఖల ద్వారా ముత్యాల తలంబ్రాలను పంపేందుకు చర్యలు చేపడుతున్నారు..అదేవిధంగా పరోక్ష సేవలు పొందేవారికి తలంబ్రాలను పంపనున్నారూ,ఈసారి నవమికి 300 క్వింటాల్ ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు .

ఈసారి నవమికి రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 30 మంది సిబ్బంది తయారీలో నిమగ్నం కానున్నారు.శ్రీరామ నవమి రోజు స్వామివారికి సీఎం రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు,పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు..మంత్రులు ,ఎమ్మెల్యేలు ,అధికారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది..అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.