కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఈ రాశివారికి శని, రవి, బుధులు అనుకూలంగా ఉన్నందువల్ల, వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరి ష్కారం మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఏ ప్రయత్నానికైనా ప్రథమార్థం అనుకూలంగా ఉంది. మొదటి పదిహేను రోజుల్లో ముఖ్యమైన పనుల చక్కబెట్టుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర వ్యవహారాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. అనవ సర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. అష్టమ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల విషయంలో శుభ వార్తలు వినే సూచనలు ఉన్నాయి కానీ, వివాహ ప్రయ త్నాలలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవ సరం. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉత్తర నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది.