
పురాణ గ్రంథాల ప్రకారం.. మీ చేతుల నుండి కొన్ని తెల్లటి వస్తువులు నేలమీదకు జారడం మంచిది కాదు.. ఇలా చేయడం వలన ఇంట్లో వ్యతిరేకత, పేదరికం, డబ్బు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

శంఖం: పూజలో శంఖానికి ఉన్న విశేష ప్రాధాన్యత తెలిసిందే. ఆలయంలో శంఖం ఉంచే ముందు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే శంఖం చేతి నుంచి కిందపడితే..ఆ పరిస్థితి ఇంటికి మంచిది కాదు.

పాలు: పాలు లేదా దానితో చేసిన వస్తువులు చేతిలో నుండి పడిపోతే.. మంచిది కాదు. ఇంట్లోని పిల్లల నుంచి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కొబ్బరి: హిందూమతంలో కొబ్బరి కాయ శుభకార్యాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందిక్. అయితే శుభ కార్యంలో చేతి నుండి కొబ్బరికాయ కింద పడితే అశుభమని నమ్ముతారు. ప్రసాదం పంచేటప్పుడు కూడా కొబ్బరి ముక్కను చేతి నుండి జారవిడిచినట్లయితే.. మంచిది కాదు..

ఉప్పు: జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రజలు తమ ఇళ్లలో ఉప్పుకు సంబంధించిన కొన్ని నియమాలు పాటించాలి. దీంతో జీవితంలో సుఖ సంపదలు వస్తాయి. ఉప్పు చేతి నుంచి నేలమీదకు జారితే.. ఆ వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అంటారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)