7 / 13
కన్య: అపార్ధాలు చేసుకోవడం, తప్పులు వెతకడం, ఇతరులను ఒక పట్టాన నమ్మకపోవడం వంటి కారణాలవల్ల కుటుంబ సమస్యలు తడితే అవకాశం ఉంటుంది. బంధువుల జోక్యం వల్ల సమస్యలు పెరగటం జరుగుతుంది. ప్రస్తుతం బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సొంత ప్రయత్నాలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలను, తొందరపాటు మాటలను దూరంగా ఉంచడం మంచిది. ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సుందరకాండ పఠించడం మంచిది.