కర్కాటకం: కళత్ర కారకుడైన శుక్రుడు ద్వితీయ స్థానమైన సింహరాశిలో సంచరించడం బాగానే ఉంది కానీ, సప్తమ స్థానాధిపతి అయిన శని అష్టమంలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో కొద్దిగా ఇబ్బందు లుండే అవకాశం ఉంది. సరసాలు, సరాగాలు, సల్లాపాలు కాస్తంత తక్కువగానూ, అలకలు, కోప తాపాలు కాస్తంత ఎక్కువగానూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల విష యంలో ఇద్దరి మధ్యా చికాకులు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఓర్పుతో ఉండడం మంచిది.