
ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు, అయితే ఇప్పటికే కుంభ రాశిలో రాహు, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. రాహువు, సూర్యుడు శత్రు గ్రహాలు. ఈ రెండు సంయోగం చెందడం అశుభ కరం, దీనిని గ్రహణ యోగం అంటారు. ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రతి క్షణం వీరికి అవమానకర సంఘటనలే ఎదురు అవుతాయి. అందుకే ఈ సమయాన్ని పాపపు ఘడియలు అని అంటారు. అయితే ఈ సమయంలో నాలుగు రాశుల వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు పండితులు.

కుంభ రాశి : కుంభ రాశిలోనే గ్రహణ యోగం ఏర్పడుతుంది. కాబట్టి వీరికి కూడా ఇది చెడు ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వీరిపై శని చెడు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది.

సింహ రాశి : సింహ రాశి వారికి గ్రహణ యోగం వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, శారీరక శ్రమ పెరుగుతుంది. అంతేకాకుండా బంధువులతో తగాదాలు కూడా రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి : రాహువు, సూర్య గ్రహ సంయోగం వలన ఏర్పడే గ్రహణ యోగం వలన వృషభ రాశి వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా చెడు వార్తలు వింటారు. అనుకోకుండా ఒక సమస్య తర్వాత మరో సమస్య వచ్చి పడుతుంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. అనేక సమస్యలు చుట్టుముడుతాయి.

తుల రాశి : తుల రాశి వారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికం అవుతారు. చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది.