ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెట్టారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే

Samatha

20 August 2026

మనీ ప్లాంట్ మొక్క లేని ఇల్లు లేదు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ప్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది.

అయితే కొంత మంది దీనిని లివింగ్ రూమ్ , బెడ్ రూమ్‌లో పెట్టుకుంటే, ఎక్కువ మంది ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కను నాటుకుంటారు.

అయితే ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ మొక్క ఉంటే, అస్సలే కొన్ని రకాల తప్పులు చేయకూడదు అని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవి అంటే?

మనీ ప్లాంట్ మొక్క అనేది కేవలం అలంకరణ కోసమే కాకుండా, ఇది ఇంటి సానుకూలత, ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపుతుంది.

అందువలన మనీ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సమయంలో, అది ఎప్పుడూ కిందకు వేలాడకుండా చూసుకోవాలంట.

అలాగే మనీ ప్లాంట్ మొక్కను ప్రధాన ద్వారం వద్ద పెంచుకునే సమయంలో, అది ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలంట.

అంతే కాకుండా, ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

నోట్ : పైసమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి