
భోగి వచ్చిందంటే చాలు ఈరోజు పిండి వంటలతో ప్రతి ఇంటిలో సందడి నెలకుంటుంది. రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఈరోజు చక్కెర పొంగల్ తినాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే? భోగి రోజు వండే చక్కెర పొంగల్ చాలా ప్రత్యేకంగా. కాగా, మంచి గుమ గుమలు వచ్చేలా భోగి రోజు చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం.

భోగి రోజు ప్రతి ఒక్కరూ చక్కెర పొంగల్ వండుతారు. అయితే దీనిని వండే క్రమంలో బెల్లంను నీటిలో కరిగించి, వడకట్టిన తర్వాత చక్కెర సిరప్ అందులో వేయడం వలన బెల్లంకి అంటుకోకుండా ఉంటుందంట.

అదే విధంగా చక్కెర పొంగల్ కోసం పాకం తారు చేసినప్పుడు, దాంట్లో కాస్త నెయ్యి వేయడం వలన పొంగల్ రచి, వాసన పెరుగుతుంది. అంతే కాకుండా ఇది మంచి రుచిని ఇస్తుందంట. అలాగే పొంగల్లో కొబ్బరి తురుము, ఎండు ద్రాక్ష , జీడిప్పులు ఇవన్నీ చక్కెరతో కలపడం వలన పొంగల్ నుంచి వచ్చే గుమ గుమలు ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటాయి.

అదే విధంగా చక్కెర పొంగల్ మంచి రుచి, వాసన రావాలి అంటే, దానిని వండే క్రమంలో బెల్లం కాస్త తగ్గించి, కర్కండు, మూడు టీస్పూన్స్ మిల్క్ మెయిడ్, కొద్దిగా కొబ్బరి పాలు కలపడం వలన చాలా అద్భుతంగా ఉంటుందంట. ఒక స్పూన్ తిన్నా, ఆ టేస్ట్ జీవితంలో మర్చిపోము, అంత అద్భుతంగా ఉంటందని చెబుతన్నారు నిపుణులు.అంతే కాకుండా అందులో కొబ్బరి తురుము, అలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేయడం, జీడిపప్పు, వీటన్నింటి నెయ్యిలో వేయించి వేయడం వలన రుచి బాగుంటుందంట.

అలాగే చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉండాలి అంటే, రెండు లేదా మూడు అరటిపండ్లు పాలల్లో కలిపి, చక్కెర పొంగల్‌లో వేయడం వలన, కూడా పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందంట. అలాగే టెంపుల్ స్టైల్‌లో స్మెల్ రావాలంటే కొంచెం పచ్చకర్పూరం వేయాలి. అదే విధంగా పొంగల్‌లో కొద్దిగా జాజికాయ పొడ వేయడం వలన రుచి వాసన కూడా పెరగుతుందంట.