
మహాభారతంలో కౌరవులు, పాండవలు, విదురుడు, భీష్ముడు , కర్ణుడు వీళ్లందరూ కీలక పాత్ర పోషిస్తారు.ఇందులో కౌరవులు ఎప్పుడూ అధర్మ మార్గమే ఎంచుకోగా, పాండవులు ధర్మ మార్గంలో నడుస్తూ, అన్నింట్లో విజయం అందుకుంటారు. ఇక మహాభారతంలోని ఎన్నో సంఘటనలు నేటి తరం వారికి ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పాండవులు విజయం కోసం విదురుడు ఎన్నో అంద్భుతమైన చిట్కాలను ఇవ్వడంతో వారు ఎన్నో విజయాలను అందుకున్నారు.

ఇక విదురుడు బందాలతో పాటు, ధర్మానికి కట్టుబడే వ్యక్తి. ఈయన చాలా నీతిగా బతకడమే కాకుండా గొప్ప దార్శనికుడిగా కూడా నిలిచాడు. అందుకే చాలా మంది విదురుడిని మహాత్మా అని కూడా పిలుస్తారు. అయితే విదరుడు జీవితంలో త్వరగా సక్సెస్ అందుకోవాలి అంటే తప్పకుండా కొన్ని లక్షణాలు ఉండాలని తెలియజేశాడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

విదురుడు చెప్పిన విజయ సత్యాల్లో ఒకటి, తెలివితేటలను సరిగ్గా ఉపయోగించుకోవడం. తెలివి ఎవరికి అయినా ఉంటుంది. కానీ ఎవరు ఎప్పుడు దానిని సరైన విధంగా ఉపయోగించుకుంటారో, వారే జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారని విదురుడు తెలియజేయడం జరిగింది.

కొంత మందికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. కొంత మంది సమాజంలో ఎక్కువ నెగిటివిటీని ఎదుర్కొంటారు. అయితే దీనికి కారణం మీ ప్రవర్తనే అంటున్నాడు విదురు. ఏ వ్యక్తికి అయినా సరే తాను మాట్లాడే విధానం, మనుషులతో మెదిలే స్వభావమే అతనికి గౌరవాన్ని విజయాన్ని ఇస్తుందంట. అలాగే ఎప్పుడూ సహాయం చేయడంలో ముందుడే వ్యక్తిని సక్సెస్ త్వరగా వరిస్తుందంట.

అలాగే ఏ వ్యక్తి అయితే పరిస్థితులకు తగ్గట్టు నడుచుకుంటాడో, అలాగే ఏ వ్యక్తి అయితే ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉంటాడో, అలా ఏ వ్యక్తులు సరైన సమయంలో ధైర్యంగా మాట్లాడగలుగుతారో, వారు చాలా త్వరగా విజయాన్ని అందుకుంటారని విదురుడు తెలుపుతున్నాడు.