- Telugu News Photo Gallery Spiritual photos 3 Planets in Aquarius: Favorable Outcomes for 6 Zodiac Signs details in telugu
Lucky Zodiac Signs: కుంభరాశిలో మూడు గ్రహాలు.. నక్కతోక తొక్కే రాశుల వారు వీరే..!
Lucky Astrology 2025: ప్రస్తుతం కుంభరాశిలో సంచారం ప్రారంభించిన మూడు ప్రధాన గ్రహాల వల్ల కొన్ని రాశులకు అనేక విధాలుగా శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న శనీశ్వరుడితో రవి, బుధులు కలవడం వల్ల ఈ నెల 27వ తేదీ వరకు మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారు నక్కతోకను తొక్కే అవకాశం ఉంది. ఇంటా బయటా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Updated on: Feb 16, 2025 | 7:52 PM

మేషం: ఈ రాశివారికి ఈ మూడు గ్రహాలు లాభస్థానంలో కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి ఉండకపోవచ్చు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవ కాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

వృషభం: ఈ రాశికి ఉద్యోగ స్థానంలో మూడు గ్రహాల కలయిక జరుగుతున్నందువల్ల ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు అన్ని విధాలుగానూ కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరు గుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల, ఇందులో రాశ్యధిపతి బుధుడు కూడా ఉండడం వల్ల అనేక ధన యోగాలు కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరంగా ఉండిపోవడానికి అవకా శాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి బుధుడు తనకు మిత్ర గ్రహాలైన రవి, శనులతో కలవడం వల్ల, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆత్మ విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందడం వల్ల ఆర్థిక సమ స్యలు చాలావరకు తగ్గిపోతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తయి ఆర్థిక లాభాలతో పాటూ బాగా ఊరట కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభముంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభి స్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతుంది. తల్లితండ్రుల నుంచి ఆస్తి లాభం కలుగుతుంది.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో మూడు గ్రహాలు చేరడం, అందులో రాశ్యధిపతి శనీశ్వరుడు కూడా ఉండడం వల్ల అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులు ఉన్నత స్థానాలను పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనం దంగా సాగిపోతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆర్థికంగా బాగా లాభాలు కలుగుతాయి.



