Zodiac Signs: గ్రహాల స్థితిగతుల ప్రభావంతో ఏ రాశివారి స్వభావం ఎలా ఉంటుంది? వారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు..

| Edited By: Janardhan Veluru

Jul 07, 2023 | 1:52 PM

జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాశుల ఏ రాశి తత్వం (స్వభావం) ఆ రాశికి ఉంటుంది. అయితే, సాధారణంగా ఈ రాశుల తత్వం పూర్తి స్థాయిలో బయటపడకపోవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతుల వల్ల, గ్రహసంచారంలో గ్రహాలు మార్పుల వల్ల ఈ తత్వాలు చాలావరకు మారిపోవడమో..

1 / 13
జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాశుల ఏ రాశి తత్వం (స్వభావం) ఆ రాశికి ఉంటుంది. అయితే, సాధారణంగా ఈ రాశుల తత్వం పూర్తి స్థాయిలో బయటపడకపోవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతుల వల్ల, గ్రహసంచారంలో గ్రహాలు మార్పుల వల్ల ఈ తత్వాలు చాలావరకు మారిపోవడమో, అసలు తత్వం వ్యక్తం కాలేకపోవడమో జరుగుతుంటుంది. ఈ ఏడాది గ్రహాల స్థితిగతుల కారణంగా ఏ రాశివారు ఏ స్థాయిలో తమ అసలు తత్వాన్ని వ్యక్తం చేసుకోవడం జరుగుతుందీ, ఏ స్థాయిలో విజయాలు సాధించేదీ ఇక్కడ పరిశీలిద్దాం.

2 / 13
మేషం: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారిలో అహం భావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అధికార దాహం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశివారు
సాధారణంగా రిజర్వుడుగా ఉంటారు. ఈ రాశిలో గురువు ఉండడం, శనీశ్వరుడు పదకొండవ స్థానం నుంచి వీక్షిస్తూ ఉండడం వంటి కారణాల వల్ల, వీరి తత్వాలకు
కొద్దిగా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. రాశిలో గురు, రాహువులు ఉండడం వల్ల అధికార కాంక్ష కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, శనీశ్వరుడి
దృష్టి వల్ల తప్పనిసరిగా కంట్రోల్ లో ఉండడం, అణగిమణగి ఉండడం వంటివి జరిగే అవకాశం ఉంది.

మేషం: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రాశివారిలో అహం భావం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. అధికార దాహం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశివారు సాధారణంగా రిజర్వుడుగా ఉంటారు. ఈ రాశిలో గురువు ఉండడం, శనీశ్వరుడు పదకొండవ స్థానం నుంచి వీక్షిస్తూ ఉండడం వంటి కారణాల వల్ల, వీరి తత్వాలకు కొద్దిగా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. రాశిలో గురు, రాహువులు ఉండడం వల్ల అధికార కాంక్ష కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, శనీశ్వరుడి దృష్టి వల్ల తప్పనిసరిగా కంట్రోల్ లో ఉండడం, అణగిమణగి ఉండడం వంటివి జరిగే అవకాశం ఉంది.

3 / 13
వృషభం: ఈ రాశివారికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ. ప్రణాళికాబద్ధంగా సంపాదిస్తూ ఉంటారు. సంసార తాపత్రయం కూడా ఎక్కువే. కుటుంబం పట్ల శ్రద్ధ కాస్తంత
ఎక్కువగానే ఉంటుంది. వీటి కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. ఈ ఏడాది ఈ రాశినాథుడైన శుక్రుడు ఎక్కువ కాలం కుజ గ్రహంతో కలిసి రాశులు
మారుతున్నందువల్ల, మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. డబ్బు సంపాదన పెరగడానికి అవకాశం ఉంది కానీ, కొద్దిగా బడ్జెట్, ప్లానింగ్ తలకిందులయ్యే
అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఖర్చులు పెరగడం, కుటుంబం మీద ఎక్కువగా ఖర్చుపెట్టడం వంటివి జరిగే సూచనలున్నాయి.

వృషభం: ఈ రాశివారికి డబ్బు మీద ప్రేమ ఎక్కువ. ప్రణాళికాబద్ధంగా సంపాదిస్తూ ఉంటారు. సంసార తాపత్రయం కూడా ఎక్కువే. కుటుంబం పట్ల శ్రద్ధ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వీటి కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. ఈ ఏడాది ఈ రాశినాథుడైన శుక్రుడు ఎక్కువ కాలం కుజ గ్రహంతో కలిసి రాశులు మారుతున్నందువల్ల, మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. డబ్బు సంపాదన పెరగడానికి అవకాశం ఉంది కానీ, కొద్దిగా బడ్జెట్, ప్లానింగ్ తలకిందులయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఖర్చులు పెరగడం, కుటుంబం మీద ఎక్కువగా ఖర్చుపెట్టడం వంటివి జరిగే సూచనలున్నాయి.

4 / 13
మిథునం: ఈ రాశివారు తమకు తెలివితేటలు ఎక్కువని గట్టి నమ్మకంతో ఉంటారు. వీరికి ఎప్పటి జీవితం అప్పుడే అన్నట్టుగా ఉంటుంది. సాధారణంగా వర్తమానం గురించే తప్ప భవిష్యత్తు గురించి వీరికి పట్టదు. ఎక్కువగా ఊహాలోకాల్లో విహరిస్తుంటారు. వీరికి ప్రయాణాలంటే ఇష్టం. ప్రస్తుతం లాభ స్థానంలో గురు రాహువుల సంచారం, భాగ్యస్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల వీరు అనుకున్నట్టే వీరి జీవితం ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ రాశినాథుడైన బుధ సంచారం కూడా చాలా కాలం పాటు అనుకూలంగా ఉన్నందువల్ల వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి. వీరి తెలివితేటలు రాణిస్తాయి.

5 / 13
కర్కాటకం: ఈ రాశివారికి సంసార తాపత్రయం, బంధుప్రీతి ఎక్కువ. జీవిత భాగస్వామి కోసం, పిల్లల కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడరు. పేరు ప్రఖ్యాతుల కోసం కూడా పాటుబడుతుంటారు. వీరికి భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఈ రాశివారికి పదవ స్థానంలో గురు రాహుల సంచారం వల్ల, రెండు, మూడు రాశుల్లో శుక్ర సంచారం వల్ల కొంతవరకు వీరి స్వభావానికి తగ్గట్టుగానే కొన్ని పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలగవచ్చు. ఆస్తి కలసి రావచ్చు. కుటుంబంతో యాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. వీలైనంతగా కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.

6 / 13
సింహం: తమ మాట చెల్లుబాటు కావాలనే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. తాము ఒక ప్రత్యేకమైన జాతికి లేదా వర్గానికి చెందినవారమనే ఒక నిశ్చితాభిప్రాయం
ఉంటుంది. అందరికంటే భిన్నంగా తమకొక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. భాగ్యస్థానంలో గురు, రాహువుల సంచారం వల్ల వీరి మనసులోని కోరికలు నెరవేరే
అవకాశం ఉన్నప్పటికీ, సప్తమంలో బలంగా ఉన్న శనీశ్వరుడి వీక్షణ కారణంగా వీరు తప్పనిసరిగా అందరితో కలిసిపోవాల్సిన పరిస్థితి, దురహంకారాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పైకి వచ్చే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. గుర్తింపు లభిస్తుంది.

సింహం: తమ మాట చెల్లుబాటు కావాలనే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. తాము ఒక ప్రత్యేకమైన జాతికి లేదా వర్గానికి చెందినవారమనే ఒక నిశ్చితాభిప్రాయం ఉంటుంది. అందరికంటే భిన్నంగా తమకొక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. భాగ్యస్థానంలో గురు, రాహువుల సంచారం వల్ల వీరి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉన్నప్పటికీ, సప్తమంలో బలంగా ఉన్న శనీశ్వరుడి వీక్షణ కారణంగా వీరు తప్పనిసరిగా అందరితో కలిసిపోవాల్సిన పరిస్థితి, దురహంకారాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పైకి వచ్చే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. గుర్తింపు లభిస్తుంది.

7 / 13
కన్య: ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తుంటారు. తమ నిర్ణయాలు, తమ ఆలోచనలు ఫైనల్ అనుకుంటారు. మంచి వ్యూహకర్తలు. వృత్తి, ఉద్యోగాల్లో పైకి ఎదగడం అనేది వీరి జీవితేచ్ఛ. దీని కోసం అహర్నిశలూ శ్రమపడుతుంటారు. ఈ ఏడాది ఈ రాశినాథుడైన బుధుడి సంచారం అనుకూలంగా
ఉన్నందువల్ల, వీరి అధికార ప్రయత్నాలు, పదోన్నతి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరవ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడి వల్ల వీరు వృత్తి ఉద్యోగాల్లో ఎదిగే అవకాశం ఉంది. అయితే, గురు గ్రహ అనుగ్రహం లేనందువల్ల ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.

కన్య: ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తుంటారు. తమ నిర్ణయాలు, తమ ఆలోచనలు ఫైనల్ అనుకుంటారు. మంచి వ్యూహకర్తలు. వృత్తి, ఉద్యోగాల్లో పైకి ఎదగడం అనేది వీరి జీవితేచ్ఛ. దీని కోసం అహర్నిశలూ శ్రమపడుతుంటారు. ఈ ఏడాది ఈ రాశినాథుడైన బుధుడి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల, వీరి అధికార ప్రయత్నాలు, పదోన్నతి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆరవ స్థానంలో సంచరిస్తున్న శనీశ్వరుడి వల్ల వీరు వృత్తి ఉద్యోగాల్లో ఎదిగే అవకాశం ఉంది. అయితే, గురు గ్రహ అనుగ్రహం లేనందువల్ల ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.

8 / 13
తుల: ఈ రాశివారికి సరదా జీవితం, విలాస జీవితం, భోగభాగ్యాల మీద మక్కువ ఎక్కువ. కలుపుగోలుతనంతో వ్యవహరిస్తుంటారు. వ్యక్తిగతంగా పేరు ప్రతిష్ఠలు
సంపాదించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. ఇందుకోసం అతిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది వీరికి శనీశ్వరుడు, గురువు, రాహు గ్రహాల సంచారం
బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది వీరు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా జీవితం సాగిపోతుంది. వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తాము సుఖ సంతోషాలలో మునిగి తేలడంతో పాటు కుటుంబాన్ని కూడా సంతోషపెడతారు.

తుల: ఈ రాశివారికి సరదా జీవితం, విలాస జీవితం, భోగభాగ్యాల మీద మక్కువ ఎక్కువ. కలుపుగోలుతనంతో వ్యవహరిస్తుంటారు. వ్యక్తిగతంగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు. ఇందుకోసం అతిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది వీరికి శనీశ్వరుడు, గురువు, రాహు గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది వీరు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా జీవితం సాగిపోతుంది. వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. తాము సుఖ సంతోషాలలో మునిగి తేలడంతో పాటు కుటుంబాన్ని కూడా సంతోషపెడతారు.

9 / 13
వృశ్చికం: ఈ రాశివారికి కష్టపడకుండానే సంపాదించాలనే కోరిక ఎక్కువ. మనసులోని విషయాలను, ప్లాన్లను ఒక పట్టాన బయటపెట్టరు. విలాస జీవితం అనుభవించాలనే కోరిక కూడా ఉంటుంది. ఇతరులతో కలివిడిగా వ్యవహరించడం చాలా తక్కువ. గురు దృష్టి లేనందువల్ల, శనీశ్వరుడి దృష్టి మాత్రమే ఉన్నందువల్ల, రాశినాథుడైన కుజుడి సంచారం కొద్దిగా మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల వీరి కోరికల్లో కొన్ని మాత్రమే నెరవేరే అవకాశం ఉంది. అయితే, అందుకు కూడా బాగా
కష్టపడాల్సి ఉంటుంది. నిరీక్షణ ఎక్కువగా ఉంటుంది. కష్టపడకుండా కొద్దిగా మాత్రమే సంపాదించే వీలుంది.

వృశ్చికం: ఈ రాశివారికి కష్టపడకుండానే సంపాదించాలనే కోరిక ఎక్కువ. మనసులోని విషయాలను, ప్లాన్లను ఒక పట్టాన బయటపెట్టరు. విలాస జీవితం అనుభవించాలనే కోరిక కూడా ఉంటుంది. ఇతరులతో కలివిడిగా వ్యవహరించడం చాలా తక్కువ. గురు దృష్టి లేనందువల్ల, శనీశ్వరుడి దృష్టి మాత్రమే ఉన్నందువల్ల, రాశినాథుడైన కుజుడి సంచారం కొద్దిగా మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల వీరి కోరికల్లో కొన్ని మాత్రమే నెరవేరే అవకాశం ఉంది. అయితే, అందుకు కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. నిరీక్షణ ఎక్కువగా ఉంటుంది. కష్టపడకుండా కొద్దిగా మాత్రమే సంపాదించే వీలుంది.

10 / 13
ధనుస్సు: ఈ రాశివారికి యాంబిషన్ ఓ పాలు ఎక్కువ. ఏ రంగంలో ప్రవేశించినా అధికారం చేపట్టాలనే తాపత్రయం ఉంటుంది. డబ్బు మీద కూడా ప్రేమ ఎక్కువే. అనేక
విధాలుగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నం కూడా చేస్తారు. ఏదైనా డబుల్ ఉండాల్సిందే. రెండు ఉద్యోగాలు, రెండు సంపాదనలు అన్నమాట. ఈ ఏడాది ఈ రాశినాథుడైన గురువు పంచమంలో మిత్ర క్షేత్రంలో ఉండడం వల్ల, శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల, వీరి ఆలోచనలు, వీరి ప్రయత్నాలు చాలావరకు
ఫలించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు.

ధనుస్సు: ఈ రాశివారికి యాంబిషన్ ఓ పాలు ఎక్కువ. ఏ రంగంలో ప్రవేశించినా అధికారం చేపట్టాలనే తాపత్రయం ఉంటుంది. డబ్బు మీద కూడా ప్రేమ ఎక్కువే. అనేక విధాలుగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నం కూడా చేస్తారు. ఏదైనా డబుల్ ఉండాల్సిందే. రెండు ఉద్యోగాలు, రెండు సంపాదనలు అన్నమాట. ఈ ఏడాది ఈ రాశినాథుడైన గురువు పంచమంలో మిత్ర క్షేత్రంలో ఉండడం వల్ల, శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల, వీరి ఆలోచనలు, వీరి ప్రయత్నాలు చాలావరకు ఫలించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు.

11 / 13
మకరం: ఈ రాశివారికి సంసార తాపత్రయం ఎక్కువ. కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఎంత కష్టాన్నయినా ఓర్చుకుంటారు. తన కోసం కాకుండా కుటుంబం కోసమే ధనం కూడబెడ తారు. ’నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రాకు‘ అనే తత్వం వీరిది. ఇతరుల విషయాల్లో సాధారణంగా జోక్యం చేసుకోరు. తన విషయాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వరు. ఈ ఏడాది శని, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరడానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి రావడానికి ఎక్కువగా కష్టపడతారు. తప్పకుండా సంపాదన పెరుగుతుంది.

12 / 13
మీనం: ఈ రాశివారిలో తాత్విక చింతన ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ అవసరాల కోసమే ధన సంపాదన సాగిస్తారు. అంతవరకే కష్టపడతారు. మితిమీరి సంపాదించడం మీద వీరికి ధ్యాస ఉండదు. వీరికి కోరికలు కూడా చాలా తక్కువ. నియమ నిబంధనలకు అంటిపెట్టుకుని ఉంటారు. ఏలిన్నాటి శని కారణంగా సంపాదన కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సంపాదనలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గురువు అనుగ్రహం ఉండడం వల్ల ఆదాయ మార్గాలు పెరగడం, అదనపు ఆదాయానికి అవకాశాలు ఏర్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది.

13 / 13
కుంభం: అంటీ ముట్టనట్టు ఉండే తత్వం ఈ రాశివారిది. కష్టపడే తత్వం కూడా వీరిదే. దూరదృష్టి ఎక్కువ. వృద్ధాప్యం మీద దృష్టితో సంపాదించాలనుకుంటారు. కుటుంబాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధిలోకి తీసుకు వస్తారు. సమయాన్ని వృథా చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటారు. ఈ
రాశిలో ఈ రాశినాథుడైన శనీశ్వరుడు సంచరిస్తున్నందువల్ల, ధన వృద్ధి స్థానమైన తృతీయ స్థానంలో గురు రాహువుల సంచారం వల్ల సంపాదన పెరగడానికి,
దాన్ని సరైన విధంగా మదుపు చేయడానికి అవకాశం ఉంది. పిల్లలను వృద్ధిలోకి తీసుకు వచ్చే సూచనలున్నాయి.

కుంభం: అంటీ ముట్టనట్టు ఉండే తత్వం ఈ రాశివారిది. కష్టపడే తత్వం కూడా వీరిదే. దూరదృష్టి ఎక్కువ. వృద్ధాప్యం మీద దృష్టితో సంపాదించాలనుకుంటారు. కుటుంబాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధిలోకి తీసుకు వస్తారు. సమయాన్ని వృథా చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటారు. ఈ రాశిలో ఈ రాశినాథుడైన శనీశ్వరుడు సంచరిస్తున్నందువల్ల, ధన వృద్ధి స్థానమైన తృతీయ స్థానంలో గురు రాహువుల సంచారం వల్ల సంపాదన పెరగడానికి, దాన్ని సరైన విధంగా మదుపు చేయడానికి అవకాశం ఉంది. పిల్లలను వృద్ధిలోకి తీసుకు వచ్చే సూచనలున్నాయి.