
కావాల్సిన పదార్ధాలు : 250 గ్రాముల మష్రూమ్స్ , అర కిలో చికెన్, ఒక పెద్ద ఉల్లిపాయ, అర టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు గింజలు, అర టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్స్ కారం, నూనెను తీసుకోవాలి.

ముందుగా చికెన్ ను తీసుకుని బాగా కడిగి శుభ్ర పరచి, ముక్కలుగా చేసుకుని పాత్రలో ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా ఉడికించి వీటిని పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్స్ కూడా తీసుకుని బాగా కడిగి ఒక గిన్నెలో బాగా ఉడకబెట్టుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి పోపు గింజలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు, ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డ్ కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

ముందుగా కడిగి ఉడక పెట్టుకున్న మష్రూమ్ ను చికెన్ ముక్కల్లో వేసి అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి రెండింటిని బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత వీటిలో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ముక్కలు బాగా మగ్గించాలి.

పుట్టగొడుగులు, చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మసాలా పొడులు అన్ని వేసి మిక్స్ అయ్యేలా గరిటేతో తిప్పుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ లు నీళ్లు పోసి 10 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచి గ్రేవీ అయ్యే వరకు ఉంచాలి . చివర్లో అర కట్ట కొత్తిమీర వేసి దించుకోవడమే.