
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్ర వేసుకుని గుర్తింపు పొందిన నటి రకుల్ ప్రీత్ సింగ్. అంతేకాక ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తూనే ఉంటుంది ఈ భామ. ఆ క్రమంలోనే శనివారం కూడా రకుల్ తన ఇన్‌స్టా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇటీవలే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను రకుల్ ప్రీత్ సింగ్ అందుకుంది.

అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అవేమీ తనకు పట్టనట్లుగా సినిమాల్లో బిజీబిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కూడా తన కొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల గుండెల్లో చిచ్చు పెడుతోంది.

ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలలో తను వెండి రంగులోని లెహంగా ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించింది. ఈ డ్రెస్‌లో తాను దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘గాలిని మీ ముఖాన్ని ముద్దాడనివ్వండి’ అంటూ ఫోటోకు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం చాలా ఆఫర్లు ఉన్నాయి. ఇక ఆమె నటించిన 'ఛత్రివాలీ' సినిమా అయితే జీ5లో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమానే కాక బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్లోత్రా నటించిన 'థ్యాంక్ గాడ్' చిత్రంలో కూడా రకుల్ కనిపించింది.