World Richest Food Items: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ ఐటెమ్స్ ఇవే..! కోటీశ్వరులకు మాత్రమే..?

|

Dec 24, 2023 | 4:30 PM

World Most Expensive Foods: ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు, ఇల్లు, నిత్యావసర వస్తువులు, బట్టలు మాత్రమే ఉంటాయని అనుకుంటాం..కానీ, ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ ఆహారాలు కూడా ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి ఆహారపదార్థాల ధర ప్లేట్‌కు లక్షల్లో ఉంటుందని తెలిస్తే మరింత షాక్‌ అవుతారు. ఒక లగ్జరీ కారు ఖరీదుతో సమానంగా ఒక ప్లేట్ ఆహారం ధర ఉంటుంది. అలాంటి ఆహారాలను కేవలం కోటీశ్వరులు మాత్రమే రుచి చూడగలరు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహారపదార్థాలు, వాటి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
Almas Caviar- ఇది అరుదైన ఆడ అల్బినో స్టర్జన్ గుడ్ల నుండి తయారు చేయబడిన ప్రత్యేక వంటకం. ఇదో విలాసవంతమైన ఆహారం. ఇరాన్ దీనికి పుట్టినిల్లు. ఇది అంతరించిపోతున్న చేప జాతి. ఈ వంటకం ఖరీదు 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ.

2 / 5
Ayam Cemani Black Chicken- ఇది ఇండోనేషియాకు చెందిన ప్రత్యేక రకం బ్లాక్ కాక్. ఈ బ్లాక్ చికెన్ ఇండోనేసియాలో చాలా ఫేమస్. దాని రక్తం తప్ప మిగతావన్నీ నల్లగా ఉంటాయి. పౌల్ట్రీ రంగంలోనే ఎంతో విలువైన ఈ బ్లాక్ చికెన్ ధర మార్కెట్లో కోడికి 5వేల డాలర్ల అంటే రూ.3.7 లక్షల వరకు ఉంటుంది.

3 / 5
Kopi Luwak Coffee : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ 'కోపి లువాక్' దీన్ని సివెట్ కాఫీ అని కూడా అంటారు. అమెరికాలో ఒక్క కప్పుకాఫీకి దాదాపు రూ. 6 వేలు ఉంటుంది. సౌదీ అరేబియా, దుబాయ్, యూఎస్, యూరప్ వంటి దేశాల్లో సివెట్ కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కాఫీ 1కేజీ ధర రూ. 20 నుంచి 25 వేల వరకు ఉంటుంది.

4 / 5
Yubari Melon: యుబారి పుచ్చకాయను జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో ఉన్న యుబారి నగరంలో మాత్రమే పండిస్తారు. అందుకే దీనికి యుబారి మెలోన్ అని పేరు పెట్టారు. దీని ధర వేలల్లో కాదు లక్షల్లో ఉంటుంది. ఈ పండు కిలో ధరతో భారతదేశంలో 30 తులాల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.  స్టేటస్ సింబల్ గా గిఫ్ట్ గా కూడా ఈ పండును ఇస్తారు.

5 / 5
Saffron: కుంకుమపువ్వును  ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు, కుంకుమపువ్వు,  దేశంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఒక కేజీ కాశ్మీర్ కుంకుమపువ్వు ధర రూ. 3 లక్షలు, ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం గా పేరు పొందింది. దాదాపు సంపన్నులు ఎక్కువగా ఉపయోగించే ఈ ఖరీదైన సుగంధ ద్రవ్యం  ధర రోజురోజుకూ పెరుగుతోంది.