Chinni Enni |
Nov 28, 2024 | 5:38 PM
వింటర్ సీజన్‌లో దొరికే పండ్లలో బత్తాయి కాయలు కూడా ఒకటి. వీటినే మోసంబి పండ్లు అని కూడా అంటారు. చాలా మంది ఎక్కువగా ఈ జ్యూసే తాగుతూ ఉంటారు. ఈ కాలంలో ఎక్కువ దొరుకుతాయి. అయితే చలి కాలంలో ఇవి తింటే జలుబు చేస్తుందని ఎవరూ పెద్దగా తాగరు.
కానీ ఇమ్యూనిటీని పెంచడంలో వీటిల్ని మించిన పండ్లు లేవు. ఈ పండ్లలో ఎక్కువగా విటమిన్ సి, ఇతర విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. శీతా కాలంలో ఈ పండ్ల రసం ఖచ్చితంగా తాగాలి. పండు తినకపోయినా రసం తాగితే చాలా మంచిది.
ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ఎలాంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. త్వరగా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
మోసంబి పండ్లు తినడం వల్ల షుగర్ లెవల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్‌తో బాధ పడేవారు కూడా ఈ జ్యూస్ తాగవచ్చు. శరీరంలో రక్తంలో, పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వును ఈజీగా గకరిగిస్తుంది.
కేవలం వింటర్ సీజనే కాకుండా ప్రతి రోజూ ఓ గ్లాస్ షుగర్ లేని జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. శరీర ఆరోగ్యమే కాకుండా చర్మంపై ముడతలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా మార్చుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా కంట్రోల్ చేస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)