
Sleeping Problems: ప్రతి ఒక్కరికి నిద్ర అత్యంత ముఖ్యమైనది. మనిషికి సరైన నిద్ర లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే సరైన నిద్ర ఉండాలని వైద్య నిపుణులు పదేపదే సూచిస్తుంటారు. చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాంటి వారికి చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. మరి కొందరేమో నిద్రిస్తుండగా, మధ్య మధ్యలో మేలుకువ వస్తుంటుంది. అలా రాత్రిపూట మధ్య మధ్యలో నిద్రలేస్తుంటే కూడా ఇబ్బందే. ఎందుకంటే అలా లేవడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయంటున్నారు నిపుణులు.

రాత్రిపూట కళ్లు మూసుకుని వెంటనే నిద్రలోకి జారుకున్నంత అదృష్టం మరేది ఉండదంటున్నారు చాలా మంది.రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి విశ్రాంతి అవసరం. ఈ విధంగా ఒక వ్యక్తి రోజుకు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్ర పట్టక కళ్లు మూసుకోవాలని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. కొంతమంది రాత్రిపూట తరచుగా మేల్కొంటారు. పడుకునే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చాలా మంది రాత్రిపూట కాఫీ, టీ తాగుతారు. ఈ కాఫీ, టీలు తాగడం వల్ల నిద్రలేమి వస్తుంది. పడుకునే రెండు మూడు గంటల ముందు కాఫీ, టీలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. రాత్రి పడుకునే ముందు గాఢంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది. ఇలా చేస్తే రాత్రిళ్లు పదే పదే నిద్రలేవరు.

రాత్రిపూట బియ్యం, చిప్స్, బంగాళదుంపలు, అరటిపండ్లు, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినవద్దు. దీని వల్ల రాత్రిపూట పదేపదే మేలుకువ రాకుండా ఉండవచ్చు. అందరిలోనూ టెన్షన్ నెలకొంది. చిన్న చిన్న విషయాలకు కూడా టెన్షన్, ఒత్తిడి తీసుకోవడం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే రాత్రి పడుకున్నా నిద్ర రాదు. అన్ని టెన్షన్‌లను పక్కనపెట్టి పడుకునే అలవాటును పెంచుకోండి.

Sleep Disorders