
రాత్రి నిద్రించేటప్పుడు స్వెటర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. కానీ మీరు ఎంచుకునే స్వెటర్ నాణ్యత, పరిశుభ్రత చాలా ముఖ్యం. చాలా బిగుతుగా ఉండే స్వెటర్లు శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. రక్త ప్రసరణకు ఆటంకం కలిగించి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. అందుకే వదులుగా, సౌకర్యవంతమైన స్వెటర్‌ను మాత్రమే ఉపయోగించాలి.

శుభ్రత ముఖ్యం: స్వెటర్ శుభ్రంగా, పొడిగా, గాలి పీల్చుకునేలా ఉండాలి. స్వెటర్ పాతదైతే, దుమ్ము లేదా మురికిగా ఉంటే అది చర్మంపై దురద, దద్దుర్లు, చికాకును కలిగిస్తుంది.

సరైన బట్టలు: స్వెటర్లకు బదులుగా చర్మం గాలి పీల్చుకోవడానికి వీలుగా ఉండే కాటన్, లినెన్ లేదా తేలికపాటి ఫాబ్రిక్ దుస్తులను నిపుణులు సిఫార్సు చేస్తారు. ఇవి చెమటను కూడా పీల్చుకుంటాయి.

చలికాలంలో సాక్స్ ధరించి పడుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఇది పాదాలను వెచ్చగా ఉంచుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. సరైన సాక్స్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. రక్త ప్రవాహాన్ని నిరోధించని వదులుగా లేదా పొడవైన సాక్స్‌లను మాత్రమే ధరించాలి.

పరిశుభ్రత: పడుకునే ముందు ఎల్లప్పుడూ శుభ్రమైన సాక్స్‌లను ధరించండి. మురికి సాక్స్ ధరించడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, పాదాల దుర్వాసన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం, వాతావరణం, వ్యక్తిగత సౌకర్యాన్ని బట్టి దుస్తులు ఎంచుకోవాలి. వేసవిలో ఉన్ని దుస్తులను పూర్తిగా నివారించాలి.