Skin Care Tips: స్కిన్ అలెర్జీతో ఇబ్బంది పడుతున్నారా.. పసుపుతో చికిత్స.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

|

Sep 17, 2022 | 7:25 PM

భారతీయుల వంటిల్లే ఒక ఔషధ శాల. పసుపు దగ్గు, జలుబు లేదా గాయాలను నయం చేయడానికి ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. పసుపును అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు.

1 / 5
పసుపును వివిధ వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు పసుపును ఆయుర్వేదంలో లక్షణాల నిధిగా కూడా వర్ణించారు. అలాగే పసుపును దశాబ్దాలుగా హోం రెమెడీగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా చర్మంలో గ్లో పెరగడానికి పసుపును ఉపయోగించవచ్చు.

2 / 5
చర్మం అలెర్జీ బారిన పడితే.. అటువంటి అలెర్జీలు తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది. ఒక వ్యక్తి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల అలెర్జీలు పెరుగుతాయి. ఇటువంటి అలర్జీలకు పసుపుతో చికిత్స చేయవచ్చు

3 / 5
 వాతావరణంలో చోటు చేసుకునే మార్పులతో కొంతమందికి అలర్జీ సమస్య కూడా పెరుగుతోంది. శరీరంలోని తెల్ల రక్త కణాలు అలెర్జీ కారకమైన ఇమ్యునోగ్లోబులిన్ E ని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల అలర్జీలు పెరగడం మొదలవుతుంది. అలర్జీలను తగ్గించడానికి పసుపు మంచి ఎంపిక.

4 / 5
పసుపు కూడా యాంటీ బయోటిక్ లక్షణాలతో కూడిన ఒక రకమైన హెర్బ్. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అలర్జీని దూరం చేసుకోవచ్చు. పసుపు శరీరంలో మంటకు కారణమయ్యే ఎంజైమ్‌లను తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 5
ఎలాంటి అలర్జీనైనా తగ్గించుకోవడానికి పసుపు పాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. పసుపు, తేనె టీ తాగడం ద్వారా అలెర్జీలు నయం అవుతాయి. రోజుకు ఒక్కసారైనా పసుపు నీరు తాగడం వల్ల అలర్జీ లక్షణాలను తగ్గించుకోవచ్చు.