
కౌమార దశలో హార్మోన్ల ప్రభావం వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. ఆ తర్వాత వాటి తాలూకు మచ్చలు అలాగే ఉండిపోతాయి. కానీ వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు అసహ్యంగా కనిపిస్తాయి. చాలా మందికి ఈ మచ్చల వెనుక ఖచ్చితమైన కారణం తెలియదు.

చర్మ సంరక్షణలో పొరపాట్ల వల్ల చర్మంపై ఈ విధంగా మచ్చలు ఏర్పడతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

గర్భధారణ సమయంలో శరీరంతో వివిధ మార్పులు సంభవిస్తాయి. మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మరింత పెరుగుతాయి. వైద్య పరిభాషలో దీనిని మెలస్మా అంటారు. అయితే, డెలివరీ తర్వాత అన్ని మచ్చలు క్రమంగా మాసిపోతాయి.

హార్మోన్ల అసమతుల్యత అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. చర్మం జిడ్డు పెరిగి, మొటిమలు వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత వాటి మచ్చలు ముఖంపై కనిపిస్తాయి. థైరాయిడ్, పీసీఓడీ కేసుల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ముఖంపై మచ్చల నివారణకు పసుపు, గంధం పేస్ట్ ఉపయోగించవచ్చు. ములేటి పొడి, పసుపు, రోజ్ వాటర్‌తో చేసిన ఫేస్‌పామ్‌ని ఉపయోగించవచ్చు. అలాగే బంగాళాదుంప రసాన్ని ముఖానికి రాసుకోవచ్చు.