Health Tips: ఆరోగ్యానికి మంచిదేనని అతిగా రన్నింగ్ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు కూడా జర తెలుసుకోండి..

|

Sep 26, 2023 | 2:44 PM

Running Side Effects: ఏ ఖర్చు లేకుండానే ఫిట్‌నెస్ సాధించాలంటే రన్నింగ్ ఉత్తమ ఎంపిక. నిత్యం రన్నింగ్ చేయడం వల్ల ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుంది. అయితే పరిమితిగా రన్నింగ్ చేసినప్పుడు మాత్రమే. అతిగా రన్నింగ్ చేస్తే లేనిపోని సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటి..? తెలుసుకుందాం..

1 / 5
Running Side Effects: రన్నింగ్ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా యువకులకు, ఉద్యోగులకు రన్నింగ్ చాలా అవసరం. రన్నింగ్ చేస్తే ఫిట్‌నెస్ మాత్రమే కాక గుండెపోటు, డయాబెటీస్, ఊభకాయం వంటి అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. కానీ అతిగా రన్నింగ్ చేయడం ఏ మాత్రం కూడా మంచిది కాదు.

2 / 5
కండరాల నొప్పి: అధికంగా పరుగులు తీయడం వల్ల కండరాల్లో ఒత్తిడి కలుగుతుంది. అలాగే ఇది కాలి కండరాల్లో నొప్పికి దారితీస్తుంది. ఈ నొప్పిని కూడా లెక్క చేయకుండా రన్నింగ్ చేస్తే కూర్చోవడం, నిలబడటం కూడా సమస్యగా మారుతుంది.

3 / 5
ఆకలి మందగించడం: ఎక్కువగా శారీరక శ్రమ చేస్తే ఆకలి పెరగడం సహజమే కానీ ఎక్కువగా రన్నింగ్ చేస్తే ఆకలి కూడా పోతుంది. నిజానికి రన్నింగ్ చేసినప్పుడు కలిగే ఆలసట ఇందుకు కారణంగా మారుతుంది.

4 / 5
చిరాకు: ఫిట్‌గా ఉండేందుకు పరిగెత్తడం పొరపాటు కాదు, కానీ అతిగా పరుగులు తీస్తే శరీరంపై దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగా రోజంతా చిరాకుగా, నీరసంగా ఉన్న అనుభూతి కలుగుతుంది.

5 / 5
నిద్రలేమి: శరీరం అలసిపోతే రాత్రి పూట మంచి నిద్ర వస్తుంది, కానీ అతి రన్నింగ్ వల్ల శరీరం మరింతగా అలసిపోతుంది. ఫలితంగా వచ్చే నొప్పులు, చికాకు కారణంగా రాత్రివేళ నిద్రపోవడం కష్టంగా మారుతుంది.