
వంటింట్లో వేరుశెనగ లేకుండా దాదాపు ఏ ఇల్లు ఉండదు. చిరుతిండి నుంచి వివిధ వంటకాలు, చట్నీల వరకు వేరుశెనగను ఉపయోగిస్తారు. వీటిని పేదల బాదం అని పిలుస్తారు. వేరుశెనగ తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. పొటాషియం, ఐరన్, జింక్ , విటమిన్-ఈ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో వేరుశెనగ తినడం మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వేరుశనగను అస్సలు తినకూడదు. ఏ సమస్యలతో బాధపడేవారు వేరుశెనగకి దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

థైరాయిడ్ సమస్య మీకు థైరాయిడ్ సమస్య ఉంటే వేరుశెనగ తీసుకోవడం వల్ల మీ TSH స్థాయి పెరుగుతుంది. అందుకే వేరుశెనగ తినకూడదు. ఒకవేళ మీరు వేరుశెనగ తినాలనుకుంటే చాలా పరిమిత పరిమాణంలో తినాలి. అలాగే మందులు వాడుతున్నప్పుడు వేరుశెనగ తీసుకోకపోవడం ఉత్తమం.

అలెర్జీ సమస్య మీకు అలెర్జీ ఉంటే వేరుశెనగలు తినడం మంచిది కాదు. ఎందుకంటే చేతులు, కాళ్ళలో దురద, నోటిపై వాపు లేదా చర్మంపై దద్దుర్లు సంభవించవచ్చు. వేరుశెనగలు ఎండాకాలంలో పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.

కాలేయ సమస్య కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు వేరుశెనగను తీసుకోవచ్చు కానీ ఎక్కువగా తినకూడదు. వాస్తవానికి వేరుశెనగలో కొన్ని మూలకాలు ఉంటాయి. ఇవి కాలేయంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ముఖ్యంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

.కీళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేరుశెనగ తినడం మానుకోవాలి. ఇది లెక్టిన్‌లను కలిగి ఉంటుంది. ఇది నొప్పిని మరింత పెంచుతుంది.

అధిక బరువు మీరు అధిక బరువు కలిగి ఉంటే వేరుశెనగను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే వేరుశెనగలో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వేరుశెనగలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఉంటాయి వీటిని అధికంగా తీసుకుంటే బరువు తగ్గడంలో సమస్య ఏర్పడవచ్చు.