Bed Tea Side Effects: పరగడుపున బెడ్ టీ తాగుతున్నారా.? ఇప్పటికైనా మానుకోండి.. లేదంటే మీ ఆరోగ్యం గోవిందా..

|

Apr 17, 2023 | 4:07 PM

చాలా మంది ఉదయం లేచిన వెంటనే రిఫ్రెష్‌గా ఉండటానికి టీ తాగుతుంటారు. దీనిని సాధారణంగా అందరూ బెడ్ టీ అంటూ ఉంటారు. టీతో రోజును ప్రారంభించే ఆచారం మన దేశంలో చాలా పురాతనమైనది. ఇది చాలా మందికి అలవాటుగా మారింది. అయితే ఖాళీ కడుపుతో (పరగడుపుతో) టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 7
చాలా మంది ఉదయం లేచిన వెంటనే రిఫ్రెష్‌గా ఉండటానికి టీ తాగుతుంటారు. దీనిని సాధారణంగా అందరూ బెడ్ టీ అంటూ ఉంటారు. టీతో రోజును ప్రారంభించే ఆచారం మన దేశంలో చాలా పురాతనమైనది. ఇది చాలా మందికి అలవాటుగా మారింది.

2 / 7
అయితే ఖాళీ కడుపుతో (పరగడుపుతో) టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే.. టీని పరగడుపున అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. పరగడుపున టీ తాగితే.. పలు అనారోగ్య సమస్యలు వస్తాయని.. సాధ్యమైనంతవరకు బెడ్ టీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

3 / 7
అధిక రక్తపోటు: అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎప్పుడూ బెడ్ టీని తాగకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే కెఫిన్ శరీరంలో కరిగిపోయిన వెంటనే రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

4 / 7
ఒత్తిడి: తరచుగా మనం టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉదయాన్నే టీ తాగుతాము. అయితే ఇలా చేయడం వల్ల టెన్షన్ మరింత పెరుగుతుంది. వాస్తవానికి టీలో కెఫిన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రను క్షణాల్లో దూరం చేస్తుంది. అయితే ఇది ఉద్రిక్తతను మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

5 / 7
జీర్ణక్రియ: ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణక్రియకు మంచిది కాదు. ఎందుకంటే ఇది కడుపులో గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది. దీంతో జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది.

6 / 7
బ్లడ్ షుగర్: ఉదయం ఖాళీ కడుపుతో చక్కెరతో చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీంతోపాటు శరీరంలోని అనేక కణాలకు అవసరమైన పోషకాలు అందవు. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

7 / 7
అల్సర్: పరగడుపుతో టీ తాగితే.. ఉదరం లోపలి భాగంలో అల్సర్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే.. ఉదయం పరగడుపుతో టీ తాగే అలావాటు ఉంటే.. ఈ రోజు నుంచే వదిలేయాలని నిపుణులు సూచిస్తున్నారు.