
అరటి, బొప్పాయి పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అజీర్ణం, వాంతులు, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ రెండింటినీ కలిపి తింటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి.

ఆయుర్వేదం ప్రకారం భిన్న స్వభావాలు అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి పండు శరీరాన్ని వేడి చేస్తుంది. ఇలాంటి పరస్పర విరుద్ధ స్వభావాలు ఉన్న ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరంలో దోషాలు ఏర్పడతాయి. ఈ కాంబినేషన్ వల్ల కొందరిలో తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, అలర్జీలు వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అరటిపండులో క్యాల్షియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లతో పాటు అనేక బి-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

విడివిడిగా వీటిని తినటం కారణంగా ఈ పండ్లలో ఉండే పోషకాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అరటిపండులో క్యాల్షియం, పొటాషియం, ఫైబరం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక బొప్పాయిలో విటమిన్లు ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లతోపాటు అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పండ్ల నుండి పూర్తి పోషకాలు అందాలంటే ఫ్రూట్ సలాడ్స్ పేరుతో విరుద్ధ స్వభావం గల పండ్లను కలిపి తినకుండా, వేర్వేరు సమయాల్లో విడివిడిగా తినడమే అత్యంత సురక్షితమైన పద్ధతి. అరటిపండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా, ఈ రెండూ స్థానిక పండ్లు కాబట్టి, వాటి నాణ్యత కూడా మంచిది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మన శరీరానికి మంచిది.