ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని టీఆర్ఎస్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభిప్రాయపడింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ తరపున పోటీ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంది. రాజ్యాంగాన్ని గౌరవించాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చింది.