సోషల్ మీడియాలో తమ ఐశ్వర్యం, విలాసాలు ప్రదర్శించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపించింది. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మధుమిత, తన ఇంట్లోని బంగారం, నగదును రీల్స్‌లో చూపించి గొప్పలకు పోయింది. అయితే కొద్దిసేపటికే దొంగలు ఇంట్లోకి చొరబడి 960 గ్రాముల బంగారం, కోటి రూపాయల నగదును దోచుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.