Water on Earth: భూమిపై నీరు ఎలా వచ్చింది.. శాస్త్రవేత్తల ప్రయోగంలో తెరపైకి కొత్త వాదన

|

Jul 07, 2023 | 1:36 PM

పంచభూతాల్లో ఒకటి నీరు.. ఇది మానవ జీవితానికి జీవనాధారం. అయితే భూమి మీద నీరు ఎలా వచ్చింది అనే విషయంపై రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల పరిశోధనలో నీరు పుట్టుక గురించి కొన్ని విషయాలను వెల్లడయ్యాయి. వీరు భూమిపై నీరు ఎక్కడ నుండి వచ్చిందనే రహస్యాన్ని ఛేదించారు. పరిశోధనలోని కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం.. 

1 / 6
భూమి చుట్టూ 71 శాతం నీరు ఉం. అయితే భూమిపైకి అంత నీరు ఎక్కడ నుండి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు దీనికి రకరకాల రీజన్స్ చెబుతూనే ఉన్నారు.  గ్రహశకలాలు అంటే సౌర వ్యవస్థ నుండి వచ్చిన గ్రహశకలాల ద్వారా నీరు భూమికి చేరిందని ఒక సిద్ధాంతం చెబుతోంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో కొత్త సమాచారాన్ని అందించారు.

2 / 6
భూమిపై నీటి రహస్యాన్ని ఛేదించామని చెబుతూనే కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు పరిశోధనలో అనేక వాదనలు చేశారు. పొడి రాళ్ల నుంచి భూమి ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహాలు ఏర్పడిన తర్వాత నీరు భూమిపైకి చేరిందని ఇది సూచిస్తుంది. భూమి సృష్టికి సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు పరిశోధన ఫలితాలు పనికివస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు

3 / 6
వాస్తవానికి భూమి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. అయితే ఎలా ఏర్పడిందో ఇప్పుడు శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భూమి లోతుల్లో ఉన్న శిలాద్రవాన్ని పరిశీలించడం ద్వారా పరిశోధకులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూమిలో కనిపించే శిలాద్రవం.. శిలల ఉష్ణోగ్రత 700 నుండి 1300 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పుడు కరిగి శిలాద్రవం ఏర్పడుతుంది. అగ్నిపర్వతం ద్వారానే శిలాద్రవం లావా రూపంలో బయటకు వస్తుంది.

4 / 6
లావాలో ఉన్న పాత శిలాద్రవం భూమి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను చెబుతుందని డైలీ మెయిల్ నివేదిక పేర్కొంది. వాస్తవానికి భూమి లోపల పొరలు అనేక భాగాలుగా విభజించబడ్డాయి. ఇందులో 15 కిలోమీటర్ల లోతును ఎగువ మాంటిల్ అంటారు. అయితే 680 కిలోమీటర్ల పొరను దిగువ మాంటిల్ అంటారు. ఈ విధంగా పొరలను నమూనా అంచనా వేయడం ద్వారా భూమి మూలలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

5 / 6

అయితే భూమి అకస్మాత్తుగా ఏర్పడలేదని పరిశోధకులు భావిస్తున్నారు. కాలక్రమేణా కొన్ని పదార్ధాలు  జోడించబడ్డాయని .. అప్పుడు భూమి నిర్మించబడిందని చెబుతున్నారు. భూమి దిగువ ఉపరితలం నుండి అంటే దిగువ మాంటిల్, పైభాగం నుండి రకరకాల సమాచారాన్ని పొందవచ్చు.

6 / 6
పరిశోధకుడు డాక్టర్ ఫ్రాంకోయిస్ టిస్సోట్ మాట్లాడుతూ.. అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే నీరు ఎక్కడ ఉందో అక్కడ జీవం ఉందని గుర్తించవచ్చు అని చెబుతున్నారు. 