Sirisha Bandla: అన్నింటా దూసుకపోతున్న తెలుగు తేజాలు.. ఒకరికంటే మరొకరు టాప్.. వారు వీరే!

|

Jul 05, 2021 | 10:01 PM

మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని ప్రతీ సారి కొందరు అతివలు నిరూపిస్తూనే ఉన్నారు. నేలపైనే కాదు.. నింగిలోనూ వారి సత్తా చాటుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో తెలుగు మహిళలు కూడా తమ సత్తా చాటుతూ.. నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

1 / 5
Sirisha Bandla: మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని ప్రతీ సారి కొందరు అతివలు నిరూపిస్తూనే ఉన్నారు. నేలపైనే కాదు.. నింగిలోనూ వారి సత్తా చాటుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో తెలుగు మహిళలు కూడా తమ సత్తా చాటుతూ.. నేతి తరం అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా మనకు వినిపించే పేర్లు.. కల్పనా చావ్లా,  సునీతా విలియమ్స్, కరణం మల్లీశ్వరీ లాంటి వారెందరలో ఉన్నారు. వీరితో పాటు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న పేరు బండ్ల శిరీష. రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా పేరు పొందారు. ఆ తరువాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళలుగా పేరుగాంచారు. వీరిద్దరు భారత దేశ ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు. వీరిలో కల్పనా చావ్లా అంతరిక్షయానంలో మరణించారు.

2 / 5
ప్రస్తుతం జులై 11 న అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు మహిళగా బండ్ల శిరీష పేరు పొందనుంది. గుంటూరు జిల్లా తెనాలి కి చెందిన ఆమె తల్లిదండ్రులు మురళీధర్, అనురాధ అమెరికాలో స్థిరపడ్డారు. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలిగా శిరీష పనిచేస్తుంది.

3 / 5
ఆమె యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని. మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్‌లో ఆమె నిష్ణాతురాలు. రిచర్డ్ బ్రాస్నన్ టీమ్‌లో ఆమె ఎంపికైంది. మొత్తం ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇందులో మన తెలుగమ్మాయి శిరీష ఒకరు.

4 / 5
ఇటీవలే ప్రముఖ క్రీడాకారిణి, తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ఢిల్లీలోని స్పోర్ట్స్ విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఎంపికయ్యింది. తొలి తెలుగు మహిళగా ఈ గౌరవం దక్కించుకుంది. తెలుగు ఖ్యాతిని మరింత పెంచింది. కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో 2000 సమ్మర్ ఒలింపిక్స్ లో ఉమెన్స్  69 కేజీల పోటీల్లో పతకం సాధించి తన సత్తా చాటింది.

5 / 5
అలాగే మిథాలీ రాజ్.. క్రికెట్ లో 22 ఏళ్ల పాటు కొనసాగుతూ, సచిన్ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమైంది. జంటిల్మన్ క్రికెట్లో.. మహిళలు కూడా సత్తా చాటుతూ ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. మిథాలీ అన్ని ఫార్మెట్లలో కలిపి 10, 273 సాధించిన తొలి మహిళగా పేరుగాంచింది. ఎందరో ఈ ఆటలోకి వచ్చేలే చేయడంలో మిథాలీ సక్సెస్ అయ్యారు.