
ప్రతి ఒక్కరికి చర్మ సంరక్షణ అనేది చాలా అవసరం. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు బటయ తిరగడం వల్ల గాలో ఉన్న దూళికణాలు మన చర్మంపైకి చేరుతాయి, అలాంటప్పుడు మనం చర్మాన్ని చేతులతో తాకితే బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల మొటిమలు ఏర్పడవచ్చు. కాబట్టి అనవసరంగా మీ చేతులతో మీ ముఖాన్ని తాకకుండా.. రోజుకు రెండు సార్లు ముఖాన్ని కడుక్కోవడం మంచింది. అలాగే ముఖం కడిగేప్పుడూ గట్టిగా రుద్దకుండా సున్నితంగా కడుక్కోవడం చాలా ముఖ్యం.

అదేవిధంగా, వారానికి కనీసం రెండుసార్లు ముల్తానీ మట్టి వంటి వాటితో ఫేస్ మాస్క్ వేసుకోవడం కూడా చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మార్కెట్లో లభించే ఫేస్ మాస్క్‌లతో పాటు, ముల్తానీ మిట్టిని ఇంట్లోనే ఉపయోగించవచ్చు, దానిని రోజ్ వాటర్, కలబంద జెల్‌తో కలిపి.. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు ఉంచి, ఆపై కడిగేస్తే చాలూ.. మీ ముఖంపై ఉన్న జిడ్డు మొత్తం పోయి.. మీ ఫేస్ సహజంగా మెరుస్తుంది.

నీరు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి జిడ్డు చర్మం ఉన్నవారు ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల చర్మంలో అయిల్ సమస్య తగ్గుతుంది. అలాగే ఢీప్రైడ్ ఆహారాలు తినడం కూడా మానుకోండి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల చర్మ సమస్యలు పెరుగుతాయి.

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మానసిక ఒత్తిడి కూడా చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత ఖరీదైన మేకప్ వేసుకున్నా, లోపల ఒత్తిడి ఉంటే, ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిని అధిగమించేందుకు ధ్యానం చేయడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

మరో ముఖ్య విషయం ఏమింటంటే.. మార్నింగ్ లేచిన వెంటనే కాసేపు ఎండలో నిల్చోంది. ఇలా చేయడం ద్వారా సూర్య కిరణాలు మీ ముఖంపై పడి చర్మంపై ఉన్న బ్యాక్టీరియా తొలగిస్తాయి. దీని వల్ల చర్మం తాజాగా ఉంటుంది. మీరు కొన్ని రోజులు ఈ చిట్కాలను పాటిస్తే, మీ ముఖంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)