
కోవిడ్ తర్వాత ఆఫీసుల్లో పనిభారం పెరిగిందనే చెప్పాలి. అధిక పని ఒత్తిడి కారణంగా అలసట, విసుగు వేధిస్తుంటాయి. ఉరుకులు, పరుగుల జాబ్ లైఫ్‌లో లీవ్ దొరికితే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. సెలవు రోజున స్నేహితులతో కలిసి చిల్లీ చికెన్, బిర్యానీలు, డ్రింక్‌లు.. లాగించేస్తారు కొంతమంది యువకులు. ఇష్టమైన డ్రింక్‌లతో రాత్రంతా ఎంజాయ్ చేస్తారు. నిజానికి మద్యపానం శరీరానికి హానికరం అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే మద్యం సేవించేటప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తించుకోవాలని వైద్యులు అంటున్నారు.

చాలా మందికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ పని ఉంటుంది. రాత్రిళ్లు మద్యం సేవించి డ్రైవ్ చేయడం కన్నా.. ఉదయం 9 గంటలకు ఒక కప్పు టీకి బదులుగా బ్రష్ చేసి తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదని డాక్టర్లు అంటున్నారు. ఐతే మద్యం సేవించి మాత్రం వాహనాలు నడపకుండా జాగ్రత్తపడాలి.

చాలా మంది రాత్రిపూట పని చేస్తుంటారు. రాత్రంతా పనిచేసిన అలసటగా ఉంటుంది. అటువంటి వారు ఉదయం మీకు ఇష్టమైన డ్రింక్ సిప్ చేయవచ్చుట.

దేశం మారితే, టైమ్ జోన్ కూడా మారుతుంది. ఇలాంటప్పుడు మెదడు ఒత్తిడికి గురవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెం డ్రింక్ సిప్ చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

ఆఫీస్ పని గంటల అనంతరం ఒత్తిడి లేదా అలసటలో ఏ పార్టీకి వెళ్లినా ఎంజాయ్ చేయలేరు. అర్ధరాత్రి వరకు డ్రింక్ చేస్తూ ఉండవల్సిన అవసరం లేదు. ఉదయం ఒక గ్లాస్ తాగితే ఫ్రెష్‌గా ఉంటుందట.

పని ఒత్తిడి, మరేదైనా ఇతర కారణాలతో మద్యం సేవించినట్లయితై అది ఎల్లప్పుడు పరిమిత మోతాదులోనే ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారం బట్టి ప్రచురించబడింది. దీంతో టీవీ9 వెబ్‌సైట్, టీవీ9కు ఎలాంటి సంబంధం లేదు.