
గులాబీ అందంగా కనిపించడమే కాదు.. ఈ పువ్వు అందాన్ని కాపాడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. చర్మానికి మేలు చేసే గులాబీ పువ్వులు చర్మాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక చర్మ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. గులాబీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కానీ దీనిని సరైన విధానంలో ఉపయోగిస్తే శీఘ్ర ఫలితాలను పొందవచ్చు. గులాబీ ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మానికి మేలు మరో ముఖ్యమైన పదార్ధం పాలు. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. గులాబీతో పాలు కలిపితే దాని నాణ్యత మరింత పెరుగుతుంది. ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో పాలు తీసుకుని అందులో కొన్ని గులాబీ రేకులను తీసుకోవాలి. మిశ్రమాన్ని మెత్తని పేస్తులా చేసి, ముఖానికి అప్లై చేసుకుంటే సరి.

అలాగే పసుపు - గులాబీ ఫేస్ ప్యాక్ కూడా ఉపయోగించవచ్చు. దీన్ని చేయడానికి ఒక గిన్నెలో పసుపు తీసుకోవాలి. దానిలో గులాబీ రేకుల పేస్ట్ వేయాలి. రెండింటినీ బాగా కలిపి, ఆ తర్వాత ముఖానికి అప్లై చేయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. ఈ ప్యాక్ ఎలాంటి చర్మ గాయాలను అయినా నయం చేయడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చుతుంది.

పెరుగు- గులాబీ రేకులతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ టాన్ వదిలించడానికి చాలా ప్రభావవంతంగా పనిస్తేంది. తగినన్ని గులాబీ రేకులు తీసుకుని, అందులో కొద్దిగా పెరుగువేసి మెత్తని పేస్టులా మిక్సీ వేసుకోవాలి. అనంతరం దీనిని ముఖానికి పట్టించాలి. ఇది ముఖంపై మచ్చలను తొలగించి నిగారింపును తిరిగి తెస్తుంది.

ముఖానికి గులాబీ రేకుల వంటి కాంతిని తీసుకొచ్చి, మృదువుగా కనిపించేలా చేయడానికి గులాబీ రుకుల ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుందన అంటున్నారు నిపుణులు. గులాబీ రేకుల్లో సహజంగా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ నివారిణిగా పని చేస్తుంది. మొటిమల సమస్యను కూడా నివారిస్తుంది.