
అవిసె గింజలు మన ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైన విత్తనాలుగా పిలుస్తారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలను తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వేయించిన అవిసె గింజలను తినడం మధుమేహం బాధితులకు చాలా ఉపయోగకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని రెగ్యులర్ వినియోగం మధుమేహం లక్షణాలను తగ్గిస్తుంది.

అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అజీర్ణం విషయంలో, వేయించిన అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు. అవిసె గింజలు గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు గోరువెచ్చని నీటితో వేయించిన అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు.

వేయించిన అవిసె గింజలను తీసుకోవడం వల్ల నిద్రలేమికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడం ద్వారా నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీర్ణశక్తిని రెట్టింపు చేస్తుంది. నాన్ వెజ్ తినని వారు కోడిగుడ్డు బదులు అవిసె గింజలు తీసుకోవడం మేలు.

సోయాబీన్స్ లాగానే, అవిసె గింజలు మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు మంచి మూలం. ప్రతిరోజూ అవిసె గింజలు తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ స్థాయిని నిర్వహిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం అనేది కణాలు, కండరాల పనితీరుకు అవసరమైన ఖనిజం, సాధారణ రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అవిసె గింజల్లో అరటిపండ్ల కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది.