రోడ్ ట్రిప్ ద్వారా చేరుకోవడానికి ఆహ్లాదకరమైన అనేక ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. వాటిలో లడఖ్ రోడ్ ట్రిప్ అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు. వాటి గురించి తెలుసుకుందాం..
మనాలి నుంచి లేహ్: లేహ్-లడఖ్ రోడ్ ట్రిప్ అత్యంత ప్రసిద్ధ అడ్వెంచర్ టూరిజం. దేశీయంగానే కాకుండా విదేశీ పౌరులు కూడా మనాలీ నుంచి లేహ్ వరకు రోడ్ ట్రిప్‌ని ఆనందిస్తారు. మనాలి నుంచి లేహ్ వరకు దూరం దాదాపు 400 కిలోమీటర్లు, బైక్ ద్వారా దానిని కవర్ చేయడం వేరే కొంత కష్టంగానే ఉంటుంది.
భుజ్ నుంచి ధోలవీర: ప్రజలు భుజ్ నుంచి ధోలవీరకు బైక్ లేదా కారులో ప్రయాణిస్తారు. మీరు ఏ మార్గంలోనైనా కచ్ చేరుకోవచ్చు. భుజ్ చేరుకున్న తర్వాత ధోలావిరాకు బయలుదేరవచ్చు. దాదాపు 2.5 నుంచి 3 గంటల్లో యాత్ర పూర్తవుతుంది. దీని దూరం 140 కిలోమీటర్లు.
కోల్‌కతా నుంచి డార్జిలింగ్: ఈ మార్గంలో ప్రయాణించేవారు దాదాపు 638 కి.మీ. ప్రయాణంలో, చంద్రకేతుగర్‌తో సహా అనేక ప్రసిద్ధ ప్రదేశాలు కూడా మధ్యలో వస్తాయి.
సిమ్లా నుంచి కాజా వరకు: ఈ మార్గం దాదాపు 400 కిలోమీటర్లు. నది ఒడ్డులు, పర్వతాల మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. మీకు ఢిల్లీ కాశ్మీరీ గేట్ నుంచి సిమ్లాకు బస్సు ఉంటుంది. సిమ్లాలో ఉండటానికి 1000 నుంచి 1500 రూపాయలకు ఒక గది దొరుకుతుంది.