
శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచుగా నీళ్లు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అంటే బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, గుమ్మడి కాయ వంటి వాటిని తినడం ఆరోగ్యానికి మంచివి. వాటిలో విటమిన్లు, మినరల్స్ సహా వివిధ పోషకాలు ఉన్నాయి. ఫలితంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ కూరగాయలను తినాలి

విటమిన్ ఎ, బి, సి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్న బీరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కనుక ఇది కంటి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొంత మందికి అలెర్జీ సమస్యలు ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు బీరకయను తినడం మంచిదో కాదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చర్మంపై దురద, దద్దుర్లు వంటి స్కిన్ సంబంధిత ఇబ్బంది ఉంటే బీరకాయకు దూరంగా ఉండడం మేలు. ఎందుకంటే కొంతమందికి ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.

గర్భధారణ సమయంలో పండ్లు, కూరగాయలు తినడం మంచిది. అయితే.. ఈ సమయంలో ఏదైనా అతిగా తినడం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భధారణ సమయంలో బీరకాయను ఎక్కువగా తినకూడదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు

కడుపుని శుభ్రపరచడానికి ప్రయోజనకరమైన బీరకాయను.. విరేచనాలతో బాధపడేవారు తినోద్దు. బీరకాయని డయేరియా పేషెంట్స్ తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు తీవ్రమవుతాయి