ఎన్నిరకాల కూరలు, పచ్చళ్లు ఉన్నా తప్పనిసరిగా అన్నం వండాల్సిందే.. అయితే అన్నం తయారు చేయడం చాలా తేలికగా అనిపించినప్పటికీ, వండడం అంత తేలికైన పని కాదు. అయితే అన్నం వండడంలో నైపుణ్యం ఉండటం ముఖ్యం.
అన్నం ఎక్కువగా ఉడికిపోయి ముద్దగా మారి పిండిగా కనిపించే సందర్భాలు ఉంటాయి. అదే సమయంలో కొన్ని సార్లు.. బియ్యం గింజలు ఒకదానితో అంటుకుని ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు అన్నం పూర్తిగా ఉడకదు. ముఖ్యంగా అప్పుడే వంట నేర్చుకునేవారికి అన్నం వండడం కూడా ఒక టాస్క్.. అయితే ఈ రోజు అన్నం సులభంగా తయారు చేసుకునే సింపుల్ చిట్కాలున్నాయి
ముందుగా అన్నం తయారు చేయడానికి బియ్యంకి కల్సిన పరిమాణంలో గిన్నెను ఎంచుకోండి. అయితే తక్కువ బియ్యం కదా అంటూ.. చాలా చిన్న పాత్ర తీసుకుని నానా ఇబ్బందులు పడతారు.
బియ్యం కొలిచి ఒక గిన్నెలో వేసి.. నీరుతో శుభ్రపరచండి. అనంతరం ఒక గిన్నెలో బియ్యం ఒక కప్పు అయితే రెండు వంతులు నీరు వేయాలి. అప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించండి.. అప్పుడు నీరు తగ్గుతూ బియ్యం ఉడుకుతాయి.
బియ్యం ఉడుకుతున్నాయో లేదో అప్పుడప్ప్పుడు చూస్తూ ఉండండి.. ఒక ఫోర్క్ తో అప్పుడప్పుడు బియ్యం కదిలించాలి. బియ్యం ఉడికేయో లేదో తెలుసుకోవడం కోసం ఇక గరిటెతో రెండు బియ్యం గింజలు తీసుకుని వేలితో నొక్కండి.
గిన్నెపై మూతపెట్టి అన్నం ఉడికించాలి. గిన్నెపై మూత తెరిచి వంట చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అది కరెక్ట్ కాదు.. అన్నం ఉడికిన తర్వాత కొంచెం నిమ్మ రసం వేసి కలపండి. అన్నం మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతేకాదు అన్నంలో నిమ్మరసానికి బదులు చిటికెడు నూనె కూడా వేసుకోవచ్చు. అన్నం పొడిపొడిగా కనిపిస్తూ చూపరులకు ఆకలిని పుట్టిస్తుంది.