Tea Bags Reusing Tips: వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

|

May 19, 2024 | 1:00 PM

కాస్త అలసటగా ఉంటే వేడివేడిగా టీ తాగాలనుకునే వారికి తేలికైన మార్గం టీ బ్యాగ్‌లను ఉపయోగించడం. వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్‌ ముంచితే చాలు క్షణాల్లో టీ తయారవుతుంది. అయితే టీ చేయడం మాత్రమే కాదు.. టీ బ్యాగ్‌ వల్ల ఇంట్లో చాలా రకాల ఉపయోగాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు టీ బ్యాగ్‌లను ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. టీ బ్యాగ్‌ని కట్ చేసి లోపల ఉన్న టీ పొడిని బయటకు తీసి..

1 / 5
కాస్త అలసటగా ఉంటే వేడివేడిగా టీ తాగాలనుకునే వారికి తేలికైన మార్గం టీ బ్యాగ్‌లను ఉపయోగించడం. వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్‌ ముంచితే చాలు క్షణాల్లో టీ తయారవుతుంది. అయితే టీ చేయడం మాత్రమే కాదు.. టీ బ్యాగ్‌ వల్ల ఇంట్లో చాలా రకాల ఉపయోగాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు టీ బ్యాగ్‌లను ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. టీ బ్యాగ్‌ని కట్ చేసి లోపల ఉన్న టీ పొడిని బయటకు తీసి అందులో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీనితో ముఖాన్ని మసాజ్ చేసుకుని, ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేస్తే.. మచ్చలేని ముఖం మీ సొంతం అవుతుంది.

3 / 5
కిచెన్‌లో డస్ట్‌బిన్ ఉండటం వల్ల దుర్వాసన వస్తుంటుంది. ముఖ్యంగా వేసవి సీజన్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నివారణకు ఉపయోగించిన టీ బ్యాగ్‌ని డస్ట్‌బిన్‌లో వేయండి. అన్ని వాసనలు ఇట్టే తొలగిపోతాయి.

4 / 5
ఇంట్లో సువాసనలు వెదజల్లడానికిఖరీదైన ఎయిర్ పాకెట్స్ కొనాల్సిన పనిలేదు. చేతిలో టీ బ్యాగ్ ఉంటే చాలు. రూమ్ ఫ్రెషనర్ కొనాల్సిన అవసరం ఉండదు. ఉపయోగించిన టీ బ్యాగ్‌ని ఆరబెట్టి, మీకు నచ్చిన ఎసెన్షియల్‌ నూనె కొన్ని చుక్కలను అందులో వేయండి. ఇప్పుడు ఈ టీ బ్యాగ్‌లను బాత్రూంలో లేదా ఇంట్లో ఏదైనా ఓ ప్రదేశంలో ఉంచితే గదంతా ఫ్రెష్‌గా ఉంటుంది.

5 / 5
వాడిన టీ బ్యాగ్‌ను వేడి నీటిలో ఉంచి, ఆ తర్వాత తడి టీ బ్యాగ్‌ని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచాలి. దీనిని కళ్ల మీద పెట్టుకుంటే కళ్ల చుట్టూ ఉండే వాపు తగ్గుతుంది. అలాగే టీ బ్యాగులు చెట్లకు ఎరువులా కూడా పనిచేస్తాయి. టీ బ్యాగ్‌ను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి.. ఉదయం, మధ్యాహ్నం మొక్క ఆకులపై పిచికారీ చేస్తే ఫంగస్ తగ్గుతుంది.