Makeup Remover: మేకప్‌ను సహజ పద్ధతుల్లో తొలగించుకోవడానికి సింపుల్ చిట్కాలు మీ కోసం..

|

Jul 10, 2023 | 11:56 AM

అందరూ ముఖ్యంగా మహిళలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, శుభకార్యాల్లో మాత్రమే కాదు.. కొంతమంది రోజూ  బయటకు వెళ్లేటప్పుడు తమ ముఖం అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు. అయితే రాత్రి పడుకునే ముందు తీసేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.

1 / 5
మహిళలు బయటకు వెళ్లేటప్పుడు తమ ముఖం అందంగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటారు. ఈ రోజుల్లో కొంతమంది పురుషులు కూడా కొద్దిగా మేకప్ వేసుకుంటున్నారు. మేకప్ ఎవరు వేసుకున్నా రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేయాల్సిందే అంటున్నారు బ్యూటీషన్లు. ఇందుకోసం మార్కెట్ లో లభించే కెమికల్ మేకప్ రిమూవర్ల బదులు.. చర్మానికి హాని కలగకుండా ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి మేకప్ తొలగించుకోవచ్చని సూచించారు.

2 / 5

మేకప్ రిమూవర్లను ఉపయోగించి మేకప్ తొలగించడం వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంది. డల్ అవుతుంది. కనుక కొబ్బరి నూనెను సహజసిద్ధమైన రిమూవర్‌గా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెను ముఖం, మెడపై బాగా అప్లై చేసి 2-3 నిమిషాల తర్వాత కాటన్ తో తుడవండి.

3 / 5
పచ్చి పాలను మేకప్ తొలగించడానికి ఉపయోగించవచ్చు. చిన్న గిన్నెలో పాలు తీసుకుని అందులో దూదిని ముంచి దానితో ముఖాన్ని తుడుచుకోవాలి.

4 / 5
తేనెను సహజమైన మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించవచ్చు. కాటన్ బాల్‌పై కొంచెం తేనె వేసి, మీ ముఖంపై ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

5 / 5
ఆవిరితో నిమిషాల్లో ముఖం నుండి మేకప్ తొలగించవచ్చు. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకొని ముఖానికి ఆవిరి పట్టండి. ఇలా 5-10 నిమిషాలు ఆవిరి పట్టి ఆ తర్వాత కాటన్ క్లాత్ లేదా కాటన్ బాల్ తో ముఖాన్ని తుడిచి, చెమటతో పాటు మేకప్ తీసేయాలి. చర్మ రంధ్రాలు తెరుచుకోవడంతో పాటు ఇతర మురికి కణాలు కూడా పోతాయి.