Kitchen Hacks: గ్యాస్ స్టౌ నల్లగా, జిడ్డుగా మారిందా? ఈ టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయొచ్చు.. ట్రై చేయండి..

| Edited By: Shaik Madar Saheb

Apr 17, 2023 | 9:23 AM

మన వంటిల్లు శుభ్రంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే..ఒక్క గ్యాస్ స్టౌ చూస్తే చాలు. ఇట్టే అర్థం అవుతుంది. కొందరి ఇళ్లలో గ్యాస్ స్టౌ మిలమిలా మెరిసిపోతుంది. కానీ కొందరి కిచెన్ లో గ్యాస్ స్టౌ మీద జిడ్డులా పేరుకుపోతుంది.

1 / 6
మన వంటిల్లు శుభ్రంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే..ఒక్క గ్యాస్ స్టౌ చూస్తే చాలు. ఇట్టే అర్థం అవుతుంది. కొందరి ఇళ్లలో గ్యాస్ స్టౌ మిలమిలా మెరిసిపోతుంది. కానీ కొందరి కిచెన్ లో గ్యాస్ స్టౌ మీద జిడ్డులా పేరుకుపోతుంది. మనం ప్రతిరోజూ రకరకాల వంటకాలు చేస్తుంటాం. వంట చేసే సమయంలో నూనె చిల్లడం, కూరలు చిల్లడం ద్వారా స్టౌ జిడ్డులా, జిగటగా మారుతుంది. ప్రతిరోజూ ఉదయం గ్యాస్ స్టౌను శుభ్రం చేసిన తర్వాత వంట  ప్రారంభించడం చాలా మందికి అలవాటు. కానీ గ్యాస్ స్టౌ శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే అసహ్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు గ్యాస్ స్టౌ క్లీన్ చేసే సమయం ఉండదు. అయితే రోజు కాకున్నా మూడు రోజులకు ఒకసారైనా దాన్ని క్లీన్ చేయాలి. మీ స్టవ్ కూడా జిడ్డుగా ఉన్నట్లయితే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. చిటికెలో మిలమిలా మెరిసిసోతుంది.

మన వంటిల్లు శుభ్రంగా ఉందా లేదా తెలుసుకోవాలంటే..ఒక్క గ్యాస్ స్టౌ చూస్తే చాలు. ఇట్టే అర్థం అవుతుంది. కొందరి ఇళ్లలో గ్యాస్ స్టౌ మిలమిలా మెరిసిపోతుంది. కానీ కొందరి కిచెన్ లో గ్యాస్ స్టౌ మీద జిడ్డులా పేరుకుపోతుంది. మనం ప్రతిరోజూ రకరకాల వంటకాలు చేస్తుంటాం. వంట చేసే సమయంలో నూనె చిల్లడం, కూరలు చిల్లడం ద్వారా స్టౌ జిడ్డులా, జిగటగా మారుతుంది. ప్రతిరోజూ ఉదయం గ్యాస్ స్టౌను శుభ్రం చేసిన తర్వాత వంట ప్రారంభించడం చాలా మందికి అలవాటు. కానీ గ్యాస్ స్టౌ శుభ్రం చేయకుండా అలాగే వదిలేస్తే అసహ్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు గ్యాస్ స్టౌ క్లీన్ చేసే సమయం ఉండదు. అయితే రోజు కాకున్నా మూడు రోజులకు ఒకసారైనా దాన్ని క్లీన్ చేయాలి. మీ స్టవ్ కూడా జిడ్డుగా ఉన్నట్లయితే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. చిటికెలో మిలమిలా మెరిసిసోతుంది.

2 / 6
వైట్‌వెనిగర్‌:
ఈ మధ్యకాలంలో గ్లాస్‌ టాప్‌ స్టవ్‌లు వాడటం ఎక్కువైంది. దీన్ని క్లీన్‌ చేయాలంటే వైట్‌ వెనిగర్‌ చాలా బాగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిలో ఒక కప్పు వైట్ వెనిగర్ వేసి కలిపి, స్ప్రే బాటిళ్లో నింపండి. స్టవ్ పై స్ప్రే చేసి ..క్లాత్ క్లీన్ చేయండి. వెనిగర్ లో ఉన్న యాసిడ్ గుణం జిడ్డును ఈజీగా తొలగిస్తుంది. ఈ లిక్విడ్ ను ప్రతిరోజూ గ్యాస్ స్టవ్ శుభ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు. గ్యాస్ బర్నర్లను క్లీన్ చేసేందుకు వైట్ వెనిగర్ ను అస్సలు వాడకూడదు. వాటిని శుభ్రం చేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగిస్తే మెరిసిపోతాయి.

వైట్‌వెనిగర్‌: ఈ మధ్యకాలంలో గ్లాస్‌ టాప్‌ స్టవ్‌లు వాడటం ఎక్కువైంది. దీన్ని క్లీన్‌ చేయాలంటే వైట్‌ వెనిగర్‌ చాలా బాగా పనిచేస్తుంది. రెండు కప్పుల నీటిలో ఒక కప్పు వైట్ వెనిగర్ వేసి కలిపి, స్ప్రే బాటిళ్లో నింపండి. స్టవ్ పై స్ప్రే చేసి ..క్లాత్ క్లీన్ చేయండి. వెనిగర్ లో ఉన్న యాసిడ్ గుణం జిడ్డును ఈజీగా తొలగిస్తుంది. ఈ లిక్విడ్ ను ప్రతిరోజూ గ్యాస్ స్టవ్ శుభ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు. గ్యాస్ బర్నర్లను క్లీన్ చేసేందుకు వైట్ వెనిగర్ ను అస్సలు వాడకూడదు. వాటిని శుభ్రం చేసేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగిస్తే మెరిసిపోతాయి.

3 / 6
హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా..
మీ ఇంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా ఉండే.. గ్యాస్‌ స్టవ్‌ను మెరిసేలా చేయవచ్చు.  స్టవ్‌ టాప్‌పై బేకింగ్‌ సోడా చల్లి... దాని మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయాలి. కాసేపు అలాగే వదిలేయాలి. ఇది గ్యాస్‌ స్టవ్‌పై పేరుకున్న జిడ్డును పూర్తిగా తొలగించేస్తుంది. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్‌ను నీటితో కడగండి.  ఆ తర్వాత క్లాత్‌తో స్టవ్‌ను శుభ్రం చేయండి. ఎంత మొండి మరకలైనా వదిలిపోవడం గ్యారెంటీ.

హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా.. మీ ఇంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా ఉండే.. గ్యాస్‌ స్టవ్‌ను మెరిసేలా చేయవచ్చు. స్టవ్‌ టాప్‌పై బేకింగ్‌ సోడా చల్లి... దాని మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేయాలి. కాసేపు అలాగే వదిలేయాలి. ఇది గ్యాస్‌ స్టవ్‌పై పేరుకున్న జిడ్డును పూర్తిగా తొలగించేస్తుంది. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్‌ను నీటితో కడగండి. ఆ తర్వాత క్లాత్‌తో స్టవ్‌ను శుభ్రం చేయండి. ఎంత మొండి మరకలైనా వదిలిపోవడం గ్యారెంటీ.

4 / 6
సాల్ట్, బేకింగ్ సోడా..
ఉప్పు, బేకింగ్ సోడా.. ఈ రెండింటినీ చెంచా చొప్పున తీసుకొని పేస్టులా చేయండి. ఇందులో క్లాత్ ముంచి స్టవ్ మొత్తం రుద్ది...కొంచెం సేపు అలాగే వదిలేయాలి.  పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. స్టవ్ పై పేరుకుపోయిన జిడ్డు, మురికి ఇట్టే వదులుతుంది.

సాల్ట్, బేకింగ్ సోడా.. ఉప్పు, బేకింగ్ సోడా.. ఈ రెండింటినీ చెంచా చొప్పున తీసుకొని పేస్టులా చేయండి. ఇందులో క్లాత్ ముంచి స్టవ్ మొత్తం రుద్ది...కొంచెం సేపు అలాగే వదిలేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేయాలి. స్టవ్ పై పేరుకుపోయిన జిడ్డు, మురికి ఇట్టే వదులుతుంది.

5 / 6

బేకింగ్ సోడా, నిమ్మకాయ..
మీ గ్యాస్‌ స్టౌ పై జిడ్డు పేరుకుపోతే.. బేకింగ్ సోడా, నిమ్మకాయతో ఈజీగా తొలగించవచ్చు. వీటి సహాయంతో గ్యాస్‌ స్టవ్‌ సులభంగా శుభ్రం అవుతుంది. బేకింగ్‌ సోడాను.. స్టవ్ టాప్‌పై చల్లాలి. నిమ్మచెక్కతో రుద్దాలి.  కొంచెం సేపు అలా వదిలేసి...కొద్దిసేపు తర్వాత నీటితో కడగాలి.

బేకింగ్ సోడా, నిమ్మకాయ.. మీ గ్యాస్‌ స్టౌ పై జిడ్డు పేరుకుపోతే.. బేకింగ్ సోడా, నిమ్మకాయతో ఈజీగా తొలగించవచ్చు. వీటి సహాయంతో గ్యాస్‌ స్టవ్‌ సులభంగా శుభ్రం అవుతుంది. బేకింగ్‌ సోడాను.. స్టవ్ టాప్‌పై చల్లాలి. నిమ్మచెక్కతో రుద్దాలి. కొంచెం సేపు అలా వదిలేసి...కొద్దిసేపు తర్వాత నీటితో కడగాలి.

6 / 6
అమోనియా..
గ్యాస్‌ బర్నర్‌లు క్లీన్‌ చేయడానికి అమోనియా చాలా బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునేముందు గ్యాస్ బర్నర్లు ఒక జిప్ లాక్ బ్యాగ్ లో వేసి..దానిలో కొంచెం అమోనియా వేయండి. ఉదయం మంచినీటితో బర్నర్లను శఉభ్రం చేయండి.ఇలా చేస్తే మీ గ్యాస్‌ బర్నర్‌లు మెరిసిపోతాయి.

అమోనియా.. గ్యాస్‌ బర్నర్‌లు క్లీన్‌ చేయడానికి అమోనియా చాలా బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునేముందు గ్యాస్ బర్నర్లు ఒక జిప్ లాక్ బ్యాగ్ లో వేసి..దానిలో కొంచెం అమోనియా వేయండి. ఉదయం మంచినీటితో బర్నర్లను శఉభ్రం చేయండి.ఇలా చేస్తే మీ గ్యాస్‌ బర్నర్‌లు మెరిసిపోతాయి.