Kitchen Tips: స్టీల్ గిన్నెలు నల్లబడ్డాయా.? ఇలా చేస్తే మీ పాత్రలు తళతళా మెరిసిపోవడం ఖాయం!

|

May 01, 2023 | 1:37 PM

వీటిని వాడే కొద్దీ మెరుపు పోయి.. నల్లగా మారిపోతాయి. మరి ఈ స్టీల్ పాత్రల మెరుపు ఎప్పటికీ అలానే ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..

1 / 5
నాడు అల్యూమినియం పాత్రలు, మట్టి కుండల్లో వంటను చేసేవారు, నేడు స్టీల్ పాత్రల్లో చేస్తున్నారు. అయితే వీటిని వాడే కొద్దీ మెరుపు పోయి.. నల్లగా మారిపోతాయి. మరి ఈ స్టీల్ పాత్రల మెరుపు ఎప్పటికీ అలానే ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..

2 / 5
నిమ్మకాయ: నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయన్నది చాలామందికి తెలియదు. ఇందులో ఉండే సిట్రస్ మొండి మరకలు, నూనె జిడ్డును తొలగించడానికి సహాపడుతుంది. గిన్నెలో బాగా నల్లబడిన భాగంపై కాస్త నిమ్మరసం వేసి.. కొద్దిసేపు అలా ఉంచండి. ఆ తర్వాత క్లీన్ చేయండి.

3 / 5
బేకింగ్ సోడా: మొండి మరకలను దూరం చేయడంలో బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఆ గిన్నెలో నీరు పోసి.. కొంచెం బేకింగ్ సోడా వేసి కలపాలి. ఆ తర్వాత నీటిని వేడి చేసి.. చల్లారనివ్వాలి. ఆ వెంటనే ఆ నీటిని పారబోసి.. మరకలు ఉన్న చోట బేకింగ్ సోడా వేసి క్లీన్ చేయండి.

4 / 5
తుప్పు మరకలు: ఈ తుప్పు మరకలను పోగొట్టాలన్నా.. బేకింగ్ సోడా బెటర్ ఆప్షన్. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా వేసి.. తుప్పు మరకలు ఉన్న పాత్రలను అందులో నానబెట్టండి.. కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆ పాత్రలను క్లీన్ చేయండి.

5 / 5
మరిగిన నీళ్లు: మీరు మరకబట్టిన స్టీల్ పాత్రలో నీళ్లు పోసి మరిగించండి. ఆ తర్వాత నీరు చల్లారాక.. ఆ గిన్నెను సబ్బుతో క్లీన్ చేయండి. ఇలా కూడా మరకలను మాయం చేయవచ్చు.